Home » Andhra Pradesh » Visakhapatnam
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంటులో పాల్గొనే ఆంధ్రయూనివర్సిటీ బాడ్మింటన్ జట్టు కోచ్‌గా ఎలమంచిలి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై.పోలిరెడ్డి నియమితులయ్యారు.
గ్రామీణ రహదారుల పనులు పరుగులు తీస్తున్నాయి. నిన్నటి వరకు గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డ గ్రామీణులు ప్రస్తుతం సంబరపడుతున్నారు.
రుషికొండ రిసార్ట్స్‌ను జగన్ కావాలనే డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్‌లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి మాత్రం 451 కోట్లు రూపాయలు నిధులు శాంక్షన్ చేసారన్నారు.
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కొత్త లేఅవుట్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. వైసీపీ ప్రభుత్వంలో ఎంఐజీ టౌన్‌షిప్‌లు వేసినా పెద్దగా స్పందన రాలేదు. ఆనందపురం మండలం పాలవలస మినహా మిగిలినచోట్ల లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో సంస్థకు ఉన్న భూముల్లో లేఅవుట్లు వేయాలని నిర్ణయించింది. మొత్తం 46 ఎకరాల్లో 538 ప్లాట్లు వచ్చేలా ప్లానింగ్ విభాగం ప్రణాళికలు రూపొందించింది.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై అసెంబ్లీలో కూటమి నాయకుల మధ్యే బుధవారం వాడివేడి చర్చ జరిగింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఏ దశలో ఉంది?, ఎలా నిర్మించబోతున్నారంటూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్న వేశారు. దానికి పురపాలక శాఖ ఇచ్చిన సమాచారం చూసి ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం తయారుచేసిన నివేదికలు ఇచ్చారని, ఈ నెల మూడో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షం నిర్వహించి, మెట్రో రైలు ప్రాజెక్టును డబుల్ డెక్కర్ మోడల్లో నిర్మించాలని అధికారులకు సూచించారని, ఆ విషయాలు ఏవీ తనకు ఇచ్చిన సమాధానంలో లేవని ఆరోపించారు.
జీవీఎంసీలో పనిచేస్తున్న తాత్కాలిక కార్మికులకు వేతనాల చెల్లింపులో వైసీపీకి చెందిన ఓ నేత చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులకు గతంలో మాదిరిగా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ (ఎస్ఎల్ఎఫ్) ద్వారా వేతనాలు చెల్లించాలని ఏడాది కిందట ప్రతిపాదన తీసుకొచ్చిన ఆయన...నాడు కౌన్సిల్లో మెజారిటీ ఉండడంతో అనుకూలమైన ఎస్ఎల్ఎఫ్లను ఎంపిక చేసి, వాటి ద్వారా వేతనాలు చెల్లించేలా చక్రం తిప్పారు. నాటి నుంచి కార్మికుల వేతనాల్లో సర్వీస్ చార్జీ కింద రెండు శాతం, ఆదాయ పన్ను కింద మరో రెండు శాతం మినహాయించుకుని ఆ మొత్తాన్ని వాటాలుగా పంచుకుని జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రావడంతో కొత్త ఎస్ఎల్ఎఫ్లకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రజక, గవర, కొప్పుల వెలమ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్లకు బుధవారం సభ్యులను నియమించింది. అందులో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 18మంది కూటమి నాయకులకు అవకాశం లభించింది. టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు ఈ నియామకాలపై హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ధోరణిని నిరసిస్తూ మూడు రోజుల పాటు ప్రధాన న్యాయస్థానానికి వెళ్లకూడదని న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఏడాది పాపను అపహరించేందుకు ఇద్దరు మహిళలు యత్నించారు. అడ్డుకున్న ఆమె తల్లిపై హత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామనగర్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కాపులుప్పాడ డంపింగ్ యార్డును చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ కార్యాచరణ రూపొందించారు. యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన 24 లక్షల టన్నుల చెత్త కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అక్టోబరు రెండో తేదీ నాటికి యార్డులో చెత్త లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.