Home » Andhra Pradesh » Visakhapatnam
తాండవలో ఎండుతున్న వరి
దేశంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే విమానాశ్రయాల జాబితాలో విశాఖపట్నం విమానాశ్రయం 2023-24 సంవత్సరానికి 27వ ర్యాంకు సాధించింది.
పల్లెల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఐదేళ్లపాటు అభివృద్ధి జాడలేని గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్షం కురిస్తే అడుగు తీసి అడుగు వేయడానికి వీలుకాని విధంగా వున్న రహదారులు ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్‌తో ముస్తాబవుతున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో ప్రస్తుతం అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మంగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో ఉపాధి నిధులతో పనులు చేపడితే బిల్లులు వస్తాయో, లేదో అన్న అనుమానంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేవారు కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుతోపాటు, ఉపాధి హామీ నిధులతో చేపట్టే పనులకు వెంటనే బిల్లులు మంజూరవుతుండడంతో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులు పోటీ పడుతున్నారు.
ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు పటిష్ట ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మొత్తం 72 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 50 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. మంగళవారం పాడేరు మండలం మినుములూరు, ముంచంగిపుట్టులో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ అదనపు కార్యదర్శి గుల్జార్ నటరాజన్ ఆదేశించారు.
అధిక వర్షాలకు ధ్వంసమైన సీలేరు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి, లంబసింగి ఘాట్‌కి మహర్దశ పట్టనుంది. రహదారుల పునర్నిర్మాణానికి రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధులు(ఎస్డీఎంఎఫ్) రూ.23.65 కోట్లు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
స్థానిక మెయిన్ రోడ్డును ఇరువైపులా ఆక్రమించిన వారికి రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. మెయిన్‌రోడ్డుకు మధ్యలోంచి 50 అడుగులలోపు ఉన్న ఆక్రమణలను వర్తకులే స్వయంగా తొలగించుకోవాలని సూచించారు.
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఇటీవల నియమించిన కూటమి ప్రభుత్వం తాజాగా జీసీసీ డైరెక్టర్లుగా ముగ్గురు కూటమి నేతలకు అవకాశం కల్పించింది.
జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో తెనుగుపూడి గురుకుల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు.