Home » Andhra Pradesh » West Godavari
జిల్లాలు దాటి ఉపాధి కోసం వచ్చిన మాపై స్థానికంగా ఉండే కొంతమంది దాడులు చేస్తూ, భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని వారినుంచి రక్షణ కల్పించాలంటూ శ్రీకాకుళం, విజయనగరం ప్రాం తాలకు చెందిన వ్యక్తులు రహదారిపై ఆందోళ నకు దిగారు.
మన చదువుకు సాంకేతికత జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. తాడేపల్లి గూడెం ఏపీ నిట్ ఆడిటోరియంలో విద్యార్థులకు స్పందనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అకడమిక్ ఎచీవ్మెంట్ బూస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెమినార్లో ఆయన మాట్లాడారు.
తాడేపల్లిగూడెం నుంచి 100 వాహనాలకు అవకాశం ఇవ్వండి. జీపీఎస్ పెట్టండి, రీచ్‌లు, ర్యాంప్‌ల నుంచి ఇసుక తెచ్చుకుంటాం. దళారుల ప్రమేయం ఉండదు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా అమలయ్యేలా చూస్తాం.
మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు చేశారు.
జిల్లాలో 6.25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందరికీ ఉచిత గ్యాస్ పథకం వర్తించదు. కేవలం తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేస్తారు.
పట్టణాల్లో ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వార్డుల వారీగా మ్యాప్‌లను రూపొందించనుంది.
తక్కువ సమయంలోనే అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ ప్రజలను సైబర్ మోసగాళ్ళు బురిడీ కొట్టించారు.
ఏడాది క్రితం ఏజెన్సీలో నేవీ ఆర్భా టం అంతా ఇంతా కాదు. అవు నన్నా.. కాదన్నా ఈ ప్రాంతంలోనే ఆయుధ డిపో ఏర్పాటుకు వీలుగా భూసేకరణకు యత్నాలు సాగాయి.
వ్యవసాయం జూదంగా మారింది. ప్రకృతి విలయంతో సాగు తీవ్ర ఒడిదుడుకులకు లోనవు తోంది. పెట్టిన పెట్టుబడి వర్షార్పణం అవుతోంది. ఈ క్రమంలో రైతుకు అండగా నిలిచేది బీమా మాత్రమే.
రైతులకు తెలియకుండా వారి భూములను లీజు పేరుతో ఓ జాతీయ బ్యాంకులో పెట్టి పెద్ద మొత్తంలో రుణం కొట్టేశారు. తీసుకున్న బాకీ సక్రమంగా చెల్లించకపోవడంతో రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ మోసం వెలుగు లోకి వచ్చింది.