Home » Crime
మదురై(Madurai) జిల్లా ఉసిలంపట్టి తాలూకా విక్రమంగళం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మూర్తి అనే టీచర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్లస్-1 విద్యార్థిని జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఆ స్కూలులో చదువుతున్న విద్యార్థుల్లో కలకలం రేపింది.
ఏడాది కాలంగా నగరంలో 208 కేసుల్లో పట్టుబడిన రూ.7.5 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీటిని నందిగామ పరిధిలోని బయో మెడికల్ వేస్టు మేనేజ్మెంట్ కంపెనీ మల్టీక్లేవ్ ప్రై. లిమిటెడ్‌లో ధ్వంసం చేయనున్నారు.
ఒడిషా నుంచి హైదరాబాద్‌కు హ్యాష్ ఆయిల్(Hash oil)ను గుట్టుగా సరఫరా చేస్తున్న నిందితున్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 1.5 కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 310 గ్రాముల బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నాయకుడు షేక్ ఖాజా పీరాపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ(AP, Karnataka, Telangana)లో మొత్తం 41 కేసులు ఉన్నాయి.
నకిలీ బెయిల్ పత్రాలతో జైలు అధికారులను బురిడీ కొట్టించి.. చంచల్‌గూడ జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ సుజాత్ అలీఖాన్(Sujat Ali Khan) కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు గాలిస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిటీ పోలీస్ కమిషర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో డబీర్‌పురా, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు.
ఓ వాహనం ఢీకొట్టడంతో కిందపడి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న పాదచారి పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapurmet) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు బాటసింగారం వద్ద ఫ్లెఓవర్పై గుర్తు తెలియని వ్యక్తి (వయస్సు సుమారు 35) నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ప్రేమికులు కొన్నిసార్లు ఉన్మాదంలో తప్పులు చేస్తూ చివరకు జైలు పాలవుతారు. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రియుడిని ఏకంగా సూట్‌కేస్‌లో బంధించి చిత్ర హింసలు పెట్టి చంపింది. చివరికి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.
తన చెల్లిని ప్రేమించిన యువకుడిని కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చిన సోదరుడిని, హత్యకు సాయపడిన అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పాళయంకోట పోలీసుల విచారణలో వెల్లడైన సమాచారం మేరకు కళ్లకురిచ్చి జిల్లాకు చెందిన విజయ్ (25) అనే యువకుడికి నాగర్‌కోవిల్(Nagercoil)లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతితో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఆరు దశాబ్దాల పాటు కలిసి కాపురం చేసిన దంపతుల్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. ఆద్యంతం అన్యోన్యంగా గడిపిన ఆ దంపతులు ఒకేరోజు రాత్రి నిద్రలోనే మరణించడం పలువురిని కలసిచివేసింది.
నగరంలోని కార్ల యజమానులకు టోకరా వేసి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ముఠా ఆటకట్టించారు రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police). మహిళా గ్యాంగ్ లీడర్ సహా.. ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.50కోట్ల విలువైన 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.