Share News

Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు హ్యాష్‌ ఆయిల్‌..

ABN , Publish Date - Dec 06 , 2024 | 08:40 AM

ఒడిషా నుంచి హైదరాబాద్‌కు హ్యాష్‌ ఆయిల్‌(Hash oil)ను గుట్టుగా సరఫరా చేస్తున్న నిందితున్ని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 1.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు హ్యాష్‌ ఆయిల్‌..

- పట్టుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

- ఇద్దరు నిందితుల అరెస్టు

- రూ. 5 లక్షల విలువైన సరుకు, కారు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: ఒడిషా నుంచి హైదరాబాద్‌కు హ్యాష్‌ ఆయిల్‌(Hash oil)ను గుట్టుగా సరఫరా చేస్తున్న నిందితున్ని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 1.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకు చెందిన కొండె మల్లికార్జున్‌, హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన మహ్మద్‌ రహమాన్‌ ఖాన్‌ ఒడిశాలో హ్యాష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: ప్రజలను మోసం చేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు..


city5.2.jpg

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. గురువారం తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్‌ రైల్వేస్టేషన్‌(Chandanagar Railway Station) సమీపంలో దాడిచేసి కారులో తరలిస్తున్న హ్యాష్‌ ఆయిల్‌ను, కారును స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇదే టీమ్‌ పురాణాపూల్‌ ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు దాడిచేసి 1.1 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2024 | 08:40 AM