Home » Crime
అక్రమరవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వెండి, బంగారు బిస్కెట్లను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుంటే, మరికొందరు మంచి డిమాండ్ ఉన్న వణ్యప్రాణులను దిగుమతి, ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పోలీసులకు దొరక్కుండా వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అక్రమంగా తరలించే తీరు చూస్తే అధికారులే ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ఇలాంటి ..
ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నివాసగృహం పరిసరాల్లో కత్తితో సంచరించిన యువకుడిని పోలీసులు నిర్బంధించారు. తేనాంబపేట సెంటాఫ్ రోడ్డు(Thenambapet Centoff Road)లో స్టాలిన్ నివసిస్తున్నారు.
నగర శివారు ప్రాంతమైన చోమంగళం(Chomangalam)లో మద్యం తాగి వచ్చి రచ్చ చేసిన భర్తపై భార్య సలసల కాగే నూనె పోసింది. దీంతో భర్తకు గాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చోమంగళం సమీపంలోని పుదునల్లూరు(Pudunallur) ప్రాంతంలో రవి (45), జయంతి (40) అనే దంపతులున్నారు.
వినియోగదారులుగా బంగారం షాపు(Gold shop)నకు వచ్చి సేల్స్‌మన్ కన్నుగప్పి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఓ మహిళను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లిజోన్ ఏసీపీ శ్రీనివాసరావు(Kukatpally Zone ACP Srinivasa Rao) తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో ఐదుగురు డాక్టర్లు ఉండటం విశేషం. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో జీఆర్పీ పోలీసులు రూ. 4.50 లక్షల విలువ చేసే 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వివరాలను వెల్లడించారు.
అపరిశుభ్రంగా ఉన్న రెండు చికెన్ దుకాణాలను సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులను ఓ ఎమ్మెల్సీ(MLC), కొందరు స్థానికులు బెదిరించారని పోలీసులకు జీహెచ్ఎంసీ(GHMC) ఫిర్యాదు చేసింది. అధికారులు స్వాధీనం చేసుకున్న పదార్థాలను స్థానికులు బలవంతంగా తీసుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని సినీనటుడు శ్రీతేజ్(Film actor Sree Tej)పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్(Gachibowli Police Station)లో ఫిర్యాదు చేసింది.
పార్ట్‌టైం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని భావించిన ప్రైవేటు ఉద్యోగికి పెట్టుబడి ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ. 2.48 లక్షలు కొల్లగొట్టారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పార్ట్‌టైం ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతికాడు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మణుగూరు ప్యాసింజర్ రైలు(Manuguru Passenger Train)లో మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. బళ్లారి(Bellary)కి చెందిన రమణమ్మ (46)కు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.