Home » Crime
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్(encounter) కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. దీంతోపాటు ఘటనా స్థలంలో పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
డ్రగ్స్, మనీల్యాండరింగ్ పేరుతో వృద్ధుడిని బెదిరించి రూ. 1.53 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals). నగరానికి చెందిన 84 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది.
బిత్తిరి సత్తి(Bittiri satti) అలియాస్ కావలి రవికుమార్‌పై సీసీఎస్ సైబర్‌క్రైమ్స్‌లో కేసు నమోదైంది. రాష్ట్రీయ వానరసేన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ మద్య బిత్తిరిసత్తి బిల్లుగీత పేరుతో ఘంటసాల ఆలపించిన భగవద్గీతను అనుకరిస్తూ ఓ పేరడీ చేసాడు.
గాజులరామారం(Gajularamaram) బుధవారం అర్ధరాత్రి కాల్పల మోతతో దద్దరిల్లింది. రెండు వర్గాలు తీవ్రంగా కొట్టుకోగా, రియల్ వ్యాపారి తన వద్ద ఉన్న తుపాకీతో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. స్థానికులు, పోలీసుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బాచుపల్లి నుంచి ఓ మహిళ, యువకుడు కలిసి బైక్‌పై గాజులరామారం వైపు వస్తున్నారు.
ఏపీ నుంచి మహారాష్ట్ర(AP to Maharashtra)కు వయా హైదరాబాద్ మీదుగా గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గరు అంత్రరాష్ట్ర స్మగ్లర్స్‌ను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు(Rachakonda SOT Police) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 60 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.
అప్పుగా తీసుకున్న రూ.1500 ఇవ్వలేదన్న కక్షతో ఏడాదిన్నర పాపను ఓ మహిళ కిడ్నాప్ చేసింది. 12 గంటల్లోనే కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్(Kachiguda Police Station)లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం డీసీపీ బి. బాలస్వామి, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ రఘు, సీఐ చంద్రకుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.
గంజాయి, మద్యం మత్తులో ఓ వ్యక్తి కాలనీలో హల్చల్ చేశాడు. వరుసకు తమ్ముడుపైనా, అతడి తల్లిపైన గొడ్డలి, స్టీల్ రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రగాయాలతో కిందపడి కొట్టుకుంటున్న వారి బాధలను సుమారు గంట పాటు అక్కడే ఉండి చూస్తూ రాక్షసానందం పొందాడు.
కుటుం బ తగాదాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ వ్యక్తి క్షణికావేశంలో కుటుంబసభ్యులు చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీర్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వైద్య పరీక్షల నిమిత్తం కూతురిని వెంటబెట్టుకొని బైక్‌పై వెళ్తుండగా టెంపో ట్రావెల్ మినీ బస్సు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో కూతురు దుర్మరణం పాలుకాగా, తండ్రికి గాయాలయ్యాయి.
ఓ గోడౌన్లో నలుగురు వ్యక్తులు పేలుడు పదార్థాల తయారీలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలోనే పేలుడు సంభవించడంతో పటాకుల తయారీలో నిమగ్నమైన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సీఎం సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.