Home » Crime
పనిచేస్తున్న బంగారం షాపు యజమానికి టోకరా వేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు. తమ్ముడు పథకం వేసి అన్నకు చెప్పగా అమలు చేశాడు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. టోలీచౌకిలో గల బ్లూ స్టోన్స్ ఆభరణాల షాపులో ఎండీ జహీరుద్దీన్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్(Hyderabad) మహానగరానికి రాజస్థాన్(Rajasthan) ముఠా గుట్టుగా దిగుమతి చేసిన మాదక ద్రవ్యాలు (పప్పీస్ట్రా)ను రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ముఠాసభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గం(Malkajgiri Constituency) కానాజిగూడ ఇందిరానగర్‌లో నివసించే సుంధీల్ సైంథల్(23) పెయింటర్. ఇతనికి సెంట్రింగ్ పనిచేసే షేక్ రహీల్(22), నరసింహ అలియాస్ నాని (21)తో స్నేహం ఉంది.
గౌలిదొడ్డి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ అతివేగంగా దూసుకువచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి(Software employee) అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వాట్సాప్ లో డీపీ మార్చి, మెసేజ్పెట్టిన సైబర్ నేరగాడు(Cybercriminal) రూ. 1.79 లక్షలు కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన వ్యాపారి(52)కి అతడి సోదరుడు(కజిన్) డీపీ వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.
బంగారు నగల చోరీ కేసులో ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున అరవింద్‌నగర్ కాలనీ(Arvindnagar Colony)లో కత్తులు, తుపాకులతో బెదిరించి రెండు కిలోల బంగారు నగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
నాలాలో బాలుడు గల్లంతయ్యాడు. ఫతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురం(Indira Gandhipuram)లో నివసిస్తున్న షేక్ మోసిన్ కుమారుడు షేక్ ముజామిల్(7) శుక్రవారం సాయంత్రం ఈద్గా మైదానంలో క్రికెట్(Cricket) ఆడుతున్నాడు.
భర్త, అత్తల వేధింపులు తాళలేని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చిత్తాపూర్ గ్రామానికి చెందిన మొక్కపాటి శ్రీనివాసరావు(Mokkapati Srinivasa Rao) పెద్ద కుమార్తె వెంకట నాగలక్ష్మి (28) మియాపూర్ మాతృశ్రీనగర్‌లో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ ఉల్లాసంగా అలిపిరి మెట్లెక్కుతున్న ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండె పట్టుకుని పడిపోయిన మిత్రుడికి ఏమైందో తెలియక పైకి లేపేందుకు ప్రయత్నించారు తోటి స్నేహితులు. పక్కన భక్తులు, సమీపంలోని సిబ్బందితో కలిసి వెంటనే తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన దొంగలను అంబర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.