Share News

Hyderabad: మధ్యప్రదేశ్ T0 మహానగరం.. గసగసాల ముసుగులో పప్పీస్ట్రా దిగుమతి

ABN , Publish Date - Dec 17 , 2024 | 08:10 AM

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌(Hyderabad) మహానగరానికి రాజస్థాన్‌(Rajasthan) ముఠా గుట్టుగా దిగుమతి చేసిన మాదక ద్రవ్యాలు (పప్పీస్ట్రా)ను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ముఠాసభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

Hyderabad: మధ్యప్రదేశ్ T0 మహానగరం.. గసగసాల ముసుగులో పప్పీస్ట్రా దిగుమతి

- రాచకొండ పోలీసుల దాడులు

- రాజస్థాన్‌ ముఠా అరెస్ట్‌

- పరారీలో మరో ముగ్గురు

- పట్టుబడిన రూ. 1.25కోట్ల విలువైన సరుకు

హైదరాబాద్‌ సిటీ: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌(Hyderabad) మహానగరానికి రాజస్థాన్‌(Rajasthan) ముఠా గుట్టుగా దిగుమతి చేసిన మాదక ద్రవ్యాలు (పప్పీస్ట్రా)ను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ముఠాసభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 1.25 కోట్లు విలువైన 53.5 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఎల్‌బీనగర్‌లో రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వేర్వేరు ఘటనల్లో ఇద్దరి దారుణ హత్య..


city3.jpg

రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్‌ బిష్ణోయ్‌, మంగీలాల్‌ దాక, భీరరామ్‌, శంకర్‌లాల్‌, శరవణ్‌ బతుకుదెరువుకోసం నగరానికి వచ్చారు. పలు ప్రాంతాల్లో స్టీల్‌వర్క్‌, ఇతర పనులు చేసినా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో అడ్డదారిలో డబ్బు సంపాదించాలని పథకం వేశారు.

ఇది ఎలా పనిచేస్తుందంటే..

నిజానికి పప్పీస్ట్రాను పండించిన తర్వాత దాని పువ్వు నుంచి ఓపీయం (నల్లమందు)ను తయారు చేస్తారు. అనంతరం మిగిలిన పప్పీస్ట్రాను గసగసాలుగా వినియోగిస్తారు. అయితే దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే సైకోట్రోఫిక్‌ మత్తు పదార్థంగా పనిచేస్తుంది.


మధ్యప్రదేశ్‌ నుంచి స్మగ్లింగ్‌

గతంలో మంగీలాల్‌ బిష్ణోయ్‌, మంగీలాల్‌ దాకలుకు హెరాయిన్‌ విక్రయించిన అనుభవం ఉంది. ప్రస్తుతం నగరంలో డ్రగ్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో మధ్యప్రదేశ్‌ నుంచి పప్పీస్ట్రాను గసగసాల ముసుగులో నగరానికి దిగుమతి చేసుకుని డ్రగ్స్‌ వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సరఫరాదారుడు పింటూ అలియాస్‌ మోహన్‌సింగ్‌ వద్ద పప్పిస్ట్రా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి (గసగసాల రూపంలో) బస్సు, రైలు మార్గాల ద్వారా హైదరాబాద్‌కు దిగుమతి చేసుకునేవారు.


ఆ తర్వాత మరో ఇద్దరి సహకారంతో నిందితులు వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ టీమ్‌ సభ్యులు నాదర్‌గుల్‌లో ఉంటున్న మంగీలాల్‌పై నిఘా పెట్టారు. మధ్యప్రదేశ్‌ నుంచి సరుకును దిగుమతి చేసుకున్న విషయం తెలియగానే దాడిచేసి 53.5 కిలోల పప్పీస్ట్రా సరుకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మంగీలాల్‌ బిష్ణోయ్‌, మంగీలాల్‌ దాక, భీరరామ్‌ను అరెస్టు చేశారు. వారికి సహకరించిన ముగ్గురు (పింటూ మోహన్‌, శంకర్‌లాల్‌, శరవణ్‌) పరారీలో ఉన్నారు. ఎస్‌వోటీ టీమ్‌, ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌, మీర్‌పేట పోలీసులను సీపీ అభినందించారు.


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 08:10 AM