Share News

Cybercriminal: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ABN , Publish Date - Dec 14 , 2024 | 01:16 PM

వాట్సాప్ ‏లో డీపీ మార్చి, మెసేజ్‌పెట్టిన సైబర్‌ నేరగాడు(Cybercriminal) రూ. 1.79 లక్షలు కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన వ్యాపారి(52)కి అతడి సోదరుడు(కజిన్‌) డీపీ వాట్సాప్‌ నెంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది.

Cybercriminal: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

- రూ.1.79 లక్షలు కాజేత

హైదరాబాద్‌ సిటీ: వాట్సాప్ ‏లో డీపీ మార్చి, మెసేజ్‌పెట్టిన సైబర్‌ నేరగాడు(Cybercriminal) రూ. 1.79 లక్షలు కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన వ్యాపారి(52)కి అతడి సోదరుడు(కజిన్‌) డీపీ వాట్సాప్‌ నెంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. అత్యవసరంగా రూ.57.9 లక్షలు కావాలని, సూచించిన బ్యాంక్‌ ఖాతాకు పంపాలని మెసేజ్‌లో ఉంది. వాట్సాప్‌ డీపీ(WhatsApp DP)లో ఫొటో ఉండటంతో డబ్బు అడుగుతుంది సోదరుడే అని భావించిన అతడు ప్రస్తుతం అంత డబ్బు తన వద్దలేదని మెసేజ్‌ పెట్టాడు.

ఈ వార్తను కూడా చదవండి: Leopard: వామ్మో చిరుత.. కొండరాళ్లపై ఎంత దర్జాగా కూర్చుందో..


city9.2.jpg

కనీసం రూ.2 లక్షలైనా పంపాలని సైబర్‌ నేరగాడు వరుసగా మెసేజ్‌(Message) చేశాడు. వ్యాపారి రూ.1.79 లక్షలు అతడు సూచించిన ఖాతాకు బదిలీ చేశాడు. తర్వాత సోదరుడిని సంప్రదించగా తాను డబ్బులు అడగలేదని చెప్పాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు పిర్యాదు చేశాడు.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 01:16 PM