Home » Editorial » Sampadakeeyam
మహాస్వప్న తెలుగు కవిత్వం పైన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. దిగంబర కవిత్వ సంకలనాలలో అతను రాసిన కవితలు ఆరంటే ఆరే! ఆ ఆరు కవితలతోనే కవిగా చిరస్థాయి నందుకున్నాడు. ఒక లేబిల్కో బ్రాండ్కో కట్టుబడే కవిత్వం కాదు అతడి కవిత్వం. మహాస్వప్నని ఏ ఇతర కవి తోనూ పోల్చలేం.
ఛత్తీస్గఢ్లో మంగళవారం నాడు జరిగిన ‘ఎన్కౌంటర్’లో ఒక అగ్రనేతతో సహా తొమ్మిదిమంది మావోయిస్టులు చనిపోయారు. దీనితో ఆ రాష్ట్రంలో ఈ సంవత్సరారంభం నుంచి జరుగుతున్న భద్రతాదళాల చర్యల్లో...
ఇజ్రాయెల్లో సోమవారం దేశవ్యాప్త సమ్మె జరిగింది. ప్రధాని బెంజమీన్ నెతన్యాహూ గాజా యుద్ధం మొదలుపెట్టిన తరువాత ఇంతటి విస్తృతస్థాయి సమ్మె జరగడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్లోని అతిపెద్ద కార్మిక సంఘమైన హిస్తాడ్రట్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది...
మణిపూర్లో హింస పూర్తిగా తగ్గిపోయిందనీ, ఆర్నెల్లలో రాష్ట్రం ప్రశాంతతని చవిచూడబోతున్నదని ముఖ్యమంత్రి బీరేన్సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇందుకు పూర్తిభిన్నంగా మొన్న ఆది, సోమవారాల్లో...
మానవ కార్యకలాపాలను వినూత్నంగా మార్చివేస్తున్న అధునాతన సాంకేతికత కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఎఐ). ప్రపంచ దేశాలు ఎఐ సామర్థ్య విస్తృతిని అన్వేషించడంలో పోటీపడుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం భూమికి సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలపై తన విధానాన్ని రూపొందించే పనిలో ఉంది. ఒకటి భూమి హక్కులను నమోదు చేసే చట్టం, రెండోది భూమి సాగుకు మద్దతును ఇచ్చే రైతు భరోసా పథకం. అయితే రెండూ ఒక దానితో ఒకటి
అయ్యో ఎంత ఘోరం ఈ తుఫాను విధ్వంసకాండ... తెలుగునేల గుండెల్లో ప్రకృతి విసిరిన జలఖడ్గం సుజలాం... సుఫలాం.. ముక్కలైన వాక్యాలు నేడు ఖండిత హృదయమై...
ప్రజాస్వామిక రాజకీయాలలో దిగువ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఒక ప్రధాన ఆలంబన రిజర్వేషన్లు. రిజర్వేషన్ల ద్వారా మాత్రమే అధికారాన్ని సాధించుకోవాలని రిజర్వేషన్ సదుపాయం ఉన్న కులాలు అభిలషిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు సృష్టిస్తున్న బీభత్సం ఊహకు అందనంతగా ఉంది. జనజీవనాన్ని ఆ కుండపోత అతలాకుతలం చేసింది. తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దయినాయి, కొన్ని ప్రాంతాలు తీవ్ర విధ్వంసాన్ని చవిచూశాయి.
కేంద్రంలోని అధికార పక్షంతో సహా రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒక ఉభయ సంకటంలో ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సందిగ్ధత పెన్షన్ (పింఛన్) పథకానికి సంబంధించినది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అనే ఆ కొత్త పింఛన్ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం (1, ఏప్రిల్, 2025) నుంచి అమలులోకి వస్తుంది. ‘ఇది ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే పథకం’ అని ప్రధాని మోదీ అన్నారు.