Home » Elections » Lok Sabha
పాతబస్తీలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సారి మజ్లీస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ‘ మీ ఓటు మజ్లీస్ కోసం కాకున్నా మసీదుల కోసం వేయండి. ఈ సారి తమ పార్టీకి ఓటు వేయకుంటే ప్రార్థనా మందిరాలను లాక్కుంటారు అని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మనసు హిందుత్వంపై ఉందని వివరించారు.
తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్‌లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఓకే దేశం ఓకే ఎన్నిక అంశంపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనేది కొత్తది ఏం కాదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు ఓకే దేశం ఓకే ఎన్నిక కొనసాగిందని గుర్తుచేశారు. 1971లో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో సమస్య వచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లో కమ్యునిస్టులతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సీపీఎం కార్యాలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. కమ్యునిస్ట్ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డితో భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని.. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లపై జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా తమకేం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నేతలు ఉండొచ్చు, బీజేపీలో ఇద్దరు ఉండొచ్చు.. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా బరిలో దిగారు. అయితే ఆమెపై శివసేన-యుబీటీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ డ్యాన్సర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రౌత్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘాన్ని బీజేపీ అశ్రయించింది. రౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్జప్తి చేసింది.
లోక్ సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. నగదుతోపాటు, బంగారం, వెండి, గంజాయిని కూడా పోలీసులు సీజ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సీఎం కుర్చీని కాపాడుకోలేరని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.