Share News

TS Elections: ఆగస్టులో రాజకీయ సంక్షోభం.. రేవంత్ మనసంతా అటు వైపే..?

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:10 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మనసు హిందుత్వంపై ఉందని వివరించారు.

TS Elections: ఆగస్టులో రాజకీయ సంక్షోభం.. రేవంత్ మనసంతా అటు వైపే..?
BJP MP Arvind Slams CM Revanth Reddy

జగిత్యాల: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మనసు హిందుత్వంపై ఉందని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేవంత్ రెడ్డి సరిగా పనిచేయలేరని వివరించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. వక్ఫ్ యాక్ట్‌ను తీసేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు. జగిత్యాలలో అర్వింద్ మీడియాతో మాట్లాడారు.

BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?


కేసీఆర్‌ను ఫాలొ కావడం ఏంటీ..?

గత ప్రభుత్వ నిర్ణయాలను రేవంత్ సర్కార్ కొనసాగించడం సరికాదని అర్వింద్ అభిప్రాయ పడ్డారు. సీబీఐకి రాష్ట్రంలో అనుమతి అంశంపై కేసీఆర్ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఎందుకు ఫాలో అవుతుందని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో సీబీఐని అనుమతించాలని కోరారు. చెరకు, పసుపు రైతుల కోసం సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. అవినీతి అంటేనే కాంగ్రెస్ పార్టీ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు.


ఆగస్టు సంక్షోభం

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో రాజకీయ సంక్షోభం రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అర్వింద్. ఆగస్టులో రాజకీయ పరంగా కీలక పరిణామాలు జరుగుతాయని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ మారాలని ఇటీవల అర్వింద్ కోరిన సంగతి తెలిసిందే. మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించారు. ఆగస్టు సంక్షోభం ముందే రావచ్చొని అర్వింద్ సంకేతాలు ఇచ్చారు.

BJP: ‘నన్ను పండబెట్టి తొక్కుతారా రండి చూద్దాం’.. రేవంత్‌కు డీకే అరుణ సవాల్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 03:20 PM