Lok Sabha Elections: నవనీత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి రౌత్‌పై ఫిర్యాదు
ABN , Publish Date - Apr 19 , 2024 | 05:45 PM
మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా బరిలో దిగారు. అయితే ఆమెపై శివసేన-యుబీటీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ డ్యాన్సర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రౌత్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘాన్ని బీజేపీ అశ్రయించింది. రౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్జప్తి చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం (Amaravathi LokSabha Seat) నుంచి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా (Navaneet Rana) బరిలో దిగారు. అయితే ఆమెపై శివసేన-యుబీటీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) డ్యాన్సర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రౌత్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘాన్ని బీజేపీ అశ్రయించింది. రౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్జప్తి చేసింది.
అమరావతిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బల్వంత్ వాంఖడేకి మద్దతుగా రౌత్ ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోటీ డ్యాన్సర్‌తో కాదు.. మహారాష్ట్రకు, మోదీకి అని ఆయన పేర్కొన్నారు. నవనీత్ రాణా ఒక డ్యాన్సర్ అని.. నటిమణి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
DD News: కాషాయం రంగులోకి మారిన డీడీ న్యూస్
దీంతో ఆమె తెర మీద అప్యాయతతో కూడిన హవభావాలు పలికస్తారని.. ఆ ట్రాప్‌లో మాత్రం పడవద్దంటూ ప్రజలకు రౌత్ సూచించారు. ఇక 2022లో నవనీత్ రాణా చేపట్టిన ఆందోళనలో భాగంగా మాతృశ్రీ (ఉద్దవ్ ఠాక్రే నివాసం)లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు.
LokSabha Elections: గాంధీనగర్‌లో నామినేషన్ వేసిన అమిత్ షా
ఆ క్రమంలో శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రౌత్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను ఓడించడం మన ప్రాథమిక విధి అంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు.
2019 ఎన్నికల్లో నవనీత్ రాణా అమరావతి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరి నిలిచి.. దిగి గెలిచారు. అయితే ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టికెట్ కేటాయించింది. దీంతో అమరావతి బీజేపీ ఎంపీగా ఆమె బరిలో నిలిచింది. మరోవైపు రౌత్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ శిండే స్పందించారు.
Lok Sabha elections 2024: తొలి దశ పోలింగ్.. డూడుల్ విడుదల చేసిన గూగుల్
రౌత్‌పై చర్యలకు ఉపక్రమించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. మహారాష్ట్రలోని విదర్భా ప్రాంతంలో అమరావతి లోక్ సభ నియోజకవర్గం ఉంది. రెండో దశలో అంటే.. ఏప్రిల్ 26వ తేదీన ఈ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఇక నవనీత్ రాణా.. గతంలో పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ చిత్రాల్లో సైతం ఆమె నటించి సంగతి తెలిసిందే.
జాతీయ వార్తల కోసం...