Breaking: సీపీఎం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు
ABN , Publish Date - Apr 19 , 2024 | 08:07 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లో కమ్యునిస్టులతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సీపీఎం కార్యాలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. కమ్యునిస్ట్ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డితో భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లో కూడా కమ్యునిస్టులతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ (Congress) భావిస్తోంది. సీపీఎం కార్యాలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. కమ్యునిస్ట్ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డితో సమావేశం అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మెజార్టీ సీట్లు సాధించి, సత్తా చాటాలని కాంగ్రెస్ అనుకుంటుంది. అందులో భాగంగా మద్దతు ఇవ్వాలని కమ్యునిస్టులను కోరుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం