Home » Elections
దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ పూర్తి అయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారన్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో భారీ సంఖ్యలో క్యూలైన్లో ఓటర్లు ఉన్నారన్నారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కొంత ఆలస్యమైందని తెలిపారు.
Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Telangana: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటు వేశారు. సోమవారం ఉదయం కరీంనగర్ జ్యోతినగర్‌లో కుటుంబ సభ్యులతో బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉందన్నారు. ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎండాకాలం కావడంతో పోలింగ్ ప్రారంభమవగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వచ్చి క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Telangana: జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 1808 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3000 పైచిలుకు మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Lok Sahba Elections 4th Phase Polling: దేశ వ్యాప్తంగా10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. తెలంగాణలోనూ నేడు పోలింగ్ జరగనుంది. నాలుగో దశలో తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లో 25, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్ 8, జమ్మూ కాశ్మీర్లో 1 చొప్పున లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Telangana: ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పహారా నడుమ పోలింగ్ కొనసాగనుంది.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. కాసేపట్లో మాక్ పోలింగ్ ప్రారంభం కానుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ జరిగింది. 17 లోక్ సభ స్థానాల్లో బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35, 809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పోలింగ్ స్టేషన్ల పై ప్రత్యేక నిఘాను సైతం ఏర్పాటు చేశారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు (Lok Sabha Election 2024) మరికొన్ని గంటల సమయమే ఉంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ పార్టీలకు ఓట్లు మళ్లేలా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది.