CEO Vikasraj: సరైన సమయానికే పోలింగ్ స్టార్ట్...
ABN , Publish Date - May 13 , 2024 | 09:38 AM
Telangana: తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ పూర్తి అయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారన్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో భారీ సంఖ్యలో క్యూలైన్లో ఓటర్లు ఉన్నారన్నారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కొంత ఆలస్యమైందని తెలిపారు.
హైదరాబాద్, మే 13: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా మాక్ పోలింగ్ పూర్తి అయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారన్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో భారీ సంఖ్యలో క్యూలైన్లో ఓటర్లు ఉన్నారన్నారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కొంత ఆలస్యమైందని తెలిపారు.
Lok Sabha Election Polling: తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్...
వర్షం కురిసినప్పటికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలింగ్ సిబ్బంది సరైన సమయానికి పోలింగ్ను స్టార్ట్ చేశారన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడైనా సమస్య ఉంటే 1950కి ఫిర్యాదు చేయాలన్నారు. 70 శాతం పోలింగ్ నమోదవుతుందని ఆశిస్తున్నట్లు సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు.
కొన్ని చోట్ల వర్షాల వల్ల నిర్మల్ , ఆదిలాబాద్ , ఆసిఫాబాద్‌లో ఇబ్బందులు వచ్చాయన్నారు. 1-2% ఈవీఎంలు ఆలస్యంగా వెళ్లాయన్నారు. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకే మాక్ పోలింగ్ జరిగిందని.. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ బాగుందన్నారు. ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాయన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద ఫిర్యాదును చెక్ చేస్తామని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
AP Elections 2024: టీడీపీ నేత రెడ్యా నాయక్‌పై వైసీపీ శ్రేణుల దాడి
TDP: ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి
Read Latest Telangana News And Telugu News