Loksabha Polls 2024: ప్రారంభమైన మాక్ పోలింగ్
ABN , Publish Date - May 13 , 2024 | 05:52 AM
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. కాసేపట్లో మాక్ పోలింగ్ ప్రారంభం కానుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ జరిగింది. 17 లోక్ సభ స్థానాల్లో బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35, 809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పోలింగ్ స్టేషన్ల పై ప్రత్యేక నిఘాను సైతం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ : తెలంగాణలో 17 లోక్ సభ (Lok sabha) స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ జరిగింది. 17 లోక్ సభ స్థానాల్లో బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35, 809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పోలింగ్ స్టేషన్ల పై ప్రత్యేక నిఘాను సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 నియోజకవర్గాలను సమస్యత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది. 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది.
Loksabha Polls: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త
పోలింగ్ కోసం ఒక లక్షా తొమ్మిది వేల బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో 5000 పోలింగ్ కేంద్రాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1లక్ష 88 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ పూర్తి చేశారు. హోమ్ ఓటింగ్ ద్వారా 20163మంది ఓటర్లు ఓటేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు 232 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కోసం విధుల్లో మొత్తం 2 లక్షల 94 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎన్నికల కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 164 కేంద్ర బలగాలతో పాటు 72,000 మంది పోలీసులు, ఇతర రాష్ట్రాల సిబ్బందితో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Loksabha Polls 2024: చిరు, నాగ్‌తో పాటు సెలబ్రిటీలంతా ఎక్కడ ఓటేస్తున్నారంటే..?
AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!
Read Latest Telangana News And Telugu News