Lok Sabha Election 2024: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత
ABN , Publish Date - May 12 , 2024 | 08:54 PM
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు (Lok Sabha Election 2024) మరికొన్ని గంటల సమయమే ఉంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ పార్టీలకు ఓట్లు మళ్లేలా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు (Lok Sabha Election 2024) మరికొన్ని గంటల సమయమే ఉంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ పార్టీలకు ఓట్లు మళ్లేలా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది.
హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రెండు వాహనాల్లో ఈ నగదు తరలిస్తున్నట్లు సమాచారం. ఉప్పల్, కీసర దగ్గర ఈ నగదు పట్టుబడింది. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ డబ్బులను పట్టుకున్నట్లు సమాచారం. కాగా ఈ పైసలు బీఆర్ఎస్ పార్టీకి చెందినదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హైదారాబాద్ నుంచి పాలకుర్తి, వర్ధన్నపేటకు తరలిస్తున్నట్లు సమాచారం.
CM Revanth: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News