Home » Politics
వైసీపీని (YSR Congress) ఓటమి భయం వెంటాడుతోందా..? ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి కష్టమేనని చెప్పడం, కనీసం ఐదారు ఎంపీ సీట్లు కూడా గెలవడం కష్టమేనని చెప్పడంతో ఒకరిద్దరు అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమేననిపిస్తోంది. ఇంతకీ వైఎస్ జగన్ (YS Jagan) మార్చాలనుకుంటున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు..? సొంత పార్టీ సోషల్ మీడియాలో ఎందుకింతలా ప్రచారం చేస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో తెలుసుకుందాం రండి..
సీఎం జగన్‌కు సొంత జిల్లా కడపలోనే బొమ్మ కనిపిస్తోంది. చెల్లెళ్లు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. గత ఎన్నికల్లో విజయానికి వాడుకున్న చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఇప్పుడూ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉందని సీబీఐ అభియోగాలు మోపడం.. వారికి జగన్ అండగా నిలవడం..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2పార్లమెంటు, 16 అసెంబ్లీ స్థానాలుండగా జిల్లాల పునర్విభజన తరువాత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెరి పార్లమెంటు, చెరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మిగతా రెండు ఏలూరు జిల్లాలో కలిసిపోయాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే పోటీ చేయగా ఈసారి మాత్రం కూటమిగా పోటీ చేస్తున్నారు. ఈసారి కృష్ణాతీరం ఎవరివైపు మొగ్గుచూపబోతోందన్నది రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అంశం...
పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. అయినా అయినా గ్రేటర్లో లోక్‌సభ ఎన్నికల సందడి అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. అభ్యర్థులు ఇప్పటివరకు కూడా పూరి స్థాయి పర్యటనలకు సైతం శ్రీకారం చుట్టలేకపోతున్నారు..
ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. బీజేపీ గ్రేటర్ పరిధిలోని మూడు లోక్‌సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ స్థానం నుంచి కొంపెల్ల మాధవీలతను బరిలోకి దింపింది. మొదటి జాబితాలోనే ఆమె పేరును ప్రకటించడంతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. కానీ..
ఉత్తర తెలంగాణ సరిహద్దులోని ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఎస్టీ రిజర్వ్డు కావడంతో ఆదివాసీ, లంబాడా సామాజిక వర్గం నేతల మధ్యనే పోటీ ఉంటుంది. అయితే ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఆదివాసీలే కావడంతో ఎన్నికలు ఆసక్తిగా మారాయి...
లోక్‌సభ ఎన్నికలు అన్ని పార్టీలకు దడ పుట్టిస్తున్నాయి.
తెలంగాణలో కీలకమైన కరీంనగర్ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా వలంటీర్ల (Volunteer System) చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Reddy) తీసుకొచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థపై ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో ఇదే వ్యవస్థపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది...