Home » 2024 Lok Sabha Elections
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
ఎన్నికల ప్రచార సందడి ముందు సినిమాలు తీయడం ఓ జోక్‌లా కనిపిస్తోందని నటి, మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వీడియోను పోస్టు చేశారు.
సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 69.16 శాతం పోలింగ్ నమోదైంది. గత మూడు దశలలో జరిగిన ఎన్నికల కంటే నాలుగోదశలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 13న తెనాలిలో తనను కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది.
తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా..