Home » AB Venkateswara Rao
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్ సర్కారు పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సందడి వాతావరణం కొనసాగుతోంది. ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు, పలువురు ఉన్నతాధికారులు వస్తున్నారు. గురువారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు మాజీ డీ.జీ ఏ.బి వెంకటేశ్వరరావు వచ్చారు.
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వారిలో 22మంది ఇప్పటికీ ఉన్నారని... తనవల్లే పార్టీ మారినట్లు వారితో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు చాలా కీలకమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు భూతద్దంలో అక్కడంతా వెతకాలని... అన్ని రకాల సాక్ష్యాలు సేకరించాలని సూచించానని తెలిపారు. ఆ రోజు పూర్తి ఆధారాలు సేకరించలేదని పేర్కొన్నారు.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అనుకున్నది సాధించారు. యూనిఫాంలో రిటైరవ్వాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరింది. హైకోర్టు చెప్పిందనో, ఉన్నతాధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందనో తెలియదు గానీ.. ఆయన పదవీవిరమణ చేయాల్సిన శుక్రవారం నాడే జగన్ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.
AB Venkateswara Rao Retirement: ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసేందుకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం(Andhra Pradesh Government) ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(Jawahar Reddy) ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, శుక్రవారం ఉదయమే ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇదే రోజున సాయంత్రం పదవీ విరమణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఈ రోజు వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ వెంటనే పోస్టింగ్ ఇచ్చింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏవీబీపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. దానిని జగన్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఏపీ సర్కార్ ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంది.
కక్ష సాధించడంలో ముఖ్యమంత్రి జగన్‌కు మించినవారు ఉండరేమో? ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, బ్యూరోక్రాట్ అయినా సరే ఆయన టార్గెట్ చేస్తే విలవిలలాడి పోవాల్సిందే.