AB Venkateswara Rao: రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు వార్నింగ్
ABN , Publish Date - Dec 24 , 2024 | 09:36 PM
Retired DGP A.B. Venkateswara Rao అబద్దాన్ని పదే పదే చెప్పి.. నిజం చేయాలనే విష సంస్కృతి, వికృత ఆలోచనల నుంచి కొన్ని పక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఇంకా బయటకు రాలేదని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు.

అమరావతి, డిసెంబర్ 24: రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి తన ఎక్స్ ఖాతా వేదికగా ఘాటుగా స్పందించారు. అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే విష సంస్కృతి, వికృత ఆలోచనల నుంచి కొన్ని పక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఇంకా బయటకు రాలేదన్నారు. ఎందుకంటే అదే వాళ్ల జీవన విధానం.. బతుకు దెరువు కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. తన మీద పెట్టిన అక్రమ కేసులో అసలు ఫోన్ టాప్పింగ్ అనే అంశమే లేదనీ తెలుసునన్నారు.
కానీ ఆరోపణలకు, కేసుకూ, విచారణకు తేడా తెలియకుండా బురద జల్లుతున్న సాక్షి దినపత్రికతో పాటు.. మరో యూట్యూబ్ ఛానల్‌కు పరువు నష్టం నోటీసులు పంపానని తెలిపారు. నికార్సైన పోలీసుగా పని చేసిన తాను చట్టంపై నమ్మకంతో చెపుతున్నానని.. వీళ్లకు చట్టం అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను అని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో నిబంధనల విరుద్దంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కోనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది.
Also Read:: సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు
Also Read: ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్
Also Read: న్యూఢిల్లీలో ఎన్డీయే నేతల బేటీ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
Also Read: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్
అనంతరం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన కుమారుడి పేరుతో ఉన్న కంపెనీని అడ్డు పెట్టుకొని.. నిఘా పరికరాలను కొనుగోలు చేశారని.. తద్వారా ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేశారంటూ తమ విచారణలో తేలిందని గత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు కేంద్ర హోం శాఖ సైతం అనుమతి ఇచ్చిందని గత వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆయనపై తీవ్రమైన అవినీతి అక్రమాల అభియోగాలపై విచారణకు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం గత ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. అయితే ఆయన పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై తదుపరి చర్యలు తీసుకోలేమని కూటమి ప్రభుత్వం భావించింది.
Also Read: రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజ్ కీలక ప్రకటన
Also Read: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు
Also Read: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్
ఆ క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఏబీ వెంకటేశ్వరరావుపై వచ్చిన అభియోగాలను పరిశీలించిన అనంతరం న్యాయశాఖ, అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి.. ఏబీ వెంకటేశ్వరరావు పై తదుపరి చర్యలన్నింటింని ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కేసులు, ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు ఇస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
For AndhraPradesh News And Telugu News