AP Police Housing Corporation : ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఏబీవీ
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:58 AM
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.

హోంశాఖ ఉత్తర్వులు
అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురైన ఆయనకు కూటమి ప్రభుత్వం ఈ మేరకు అవకాశం కల్పించింది. ఏబీవీ ఈ పోస్టులో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించింది. సీనియర్ ఐపీఎస్ అయిన ఆయన్ను రెండుసార్లు సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు పోస్టింగ్ కోసం ఆయన కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయినా వైసీపీ ప్రభుత్వం ఆయనపై తన వైఖరి కొనసాగించింది. పదవీ విరమణ చివరి రోజు పోస్టింగ్ ఇవ్వడంతో ఒకే రోజు బాధ్యతలు స్వీకరించి.. అదే రోజు రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి కల్పించింది. జగన్ ప్రభుత్వ కక్షసాధింపునకు వెంకటేశ్వరరావు దాదాపు నాలుగేళ్ల సర్వీ్‌సను కోల్పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీపై సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు సర్వీస్ మొత్తాన్ని క్రమబద్ధీకరించింది.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News