Home » Accident
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పుణే కారు ప్రమాదం’ కేసులో నిందితుడైన 17 ఏళ్ల బాలుడు.. ప్రమాదం జరిగిన రోజున అధిక మోతాదులో మద్యం తాగే కారును నడిపినట్లు అంగీకరించాడు. ‘అవును.. ఆ రోజు అధిక మోతాదులో మద్యం తాగే కారును నడిపాను.
దేవరపల్లి మండలం బందపురం వద్ద జాతీయ రహదారి(National Highway) ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని(lorry) వెనక నుంచి కావేరి ట్రావెల్స్(Kaveri Travels) బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు తీవ్రగాయాలు అయ్యాయి. మరో 10మందికి స్వల్పగాయాలు అయ్యాయి.
పూణే(pune) పోర్షే కారు(Porsche car) ప్రమాదం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు గురించి కీలక అప్డేట్ వచ్చింది. నిందితుడి మైనర్ తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మైనర్ నిందితుడి తల్లి శివాని అగర్వాల్ తన బ్లడ్ శాంపిల్ ఇచ్చి తన కుమారుడి బ్లడ్ శాంపిల్ మార్చేందుకు వైద్యులకు డబ్బులు చెల్లించిందని పోలీసులు పేర్కొన్నారు.
వారు ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగ వేటలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుంచి హైదరాబాద్కు వచ్చారు. తమ ప్రయత్నాలను చేస్తుండగానే దురదృష్టం వెంటాడింది.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో తండ్రి, కొడుకు మృతిచెందారు. అదే వాహనంపై ఉన్న తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
జమ్మూకశ్మీర్లో గురువారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు జమ్మూ జిల్లాలో అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోవడంతో 22 మంది దుర్మరణం చెందారు.
ఇలాంటి దుస్థితి ఏ పసివాడికీ రాకూడదు. ఆ పసి మనసులో పడిన ముద్ర జీవిత కాలం చెరిగిపోవడం కష్టమే. అసలేం జరిగిందంటే.. రాజమండ్రి కి చెందిన శెట్టి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి పది రోజుల క్రితం తల్లి, భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చాడు. పాల ప్యాకెట్ కోసమని దుర్గా ప్రసాద్ తన రెండేళ్ల కుమారుడితో కలిసి రోడ్డుకు వచ్చాడు.
బొగ్గు గనిలో పని అంటే అంత ఆషామాషీ ఏమీ కాదు. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ కష్టం. అసలే బొగ్గు గనిలో విపరీతమైన వేడి ఉంటుంది. దానికి తోడు మండే ఎండలు.. అంతటి శ్రమకోర్చి కుటుంబం గడవడం కోసం నానా తిప్పలు పడినా కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు వెంటాడుతుంటాయి. తాజాగా గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది.
బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల మండలం అప్పికట్ట సమీపంలోని నల్లమాడ వాగులో నలుగురు గల్లంతయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభించగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు.
ఖమ్మం జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు రహదారి పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని భార్య, ఇద్దరు చిన్నారులు మరణించగా, కారు నడిపిన భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.