Home » Air india
ఫైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల వల్ల విమానాలను తగ్గిస్తున్నామని విస్తారా ఎయిర్ లైన్స్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్నిరోజులుగా విమానాల ఆలస్యానికి గల కారణం ఇదేనని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. కొన్ని దేశీయ మార్గాలలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు బోయింగ్ 787 లాంటి పెద్ద విమానాల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. రన్‌వే పై రెండు విమానాలు అత్యంత చేరువగా రావడంతో.. వింగ్ టు వింగ్ ఢీకొన్నాయి. దీంతో.. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు విరిగాయి. ఒక విమానం చెన్నైకి వెళ్తుండగా, మరొకటి దర్భంగాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. విమానం దిగి వస్తోన్న ఓ 80 ఏళ్ల వ్యక్తి పడిపోయాడు. అతనిని తరలించేందుకు వీల్ చైర్ అందుబాటులో లేదు.
ముంబయిలోని(Mumbai) ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణం జరిగింది. వీల్చేర్ అందుబాటులో లేకపోవడంతో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ రావడం ఆలస్యం కావడంతో కాలినడకనే బయటకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ 80 ఏళ్లు వృద్ధుడు దుర్మరణం చెందారు.
తమ కస్టమర్లకు మెరుగైన, సురక్షితమైన సేవలు అందించాల్సిన విమానయాన సంస్థలు అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాయి. ఓ ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను బేఖాతరు చేస్తుంటాయి. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ కూడా అలాంటి తప్పే చేసింది.
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం దగ్గరపడుతున్న తరుణంలో అయోధ్య నుంచి కోల్‌కతా, బెంగళూరును కలుపుతూ ప్రయాణించే తొలి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లయిట్ ను కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జెండా ఊపి ప్రారంభించారు.
శ్రేయత్ గార్గ్ . ఇటీవల భర్త, పిల్లలతో కలిసి టొరంటోకు ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లారు. నలుగురి టికెట్ల కోసం రూ.4.5 లక్షలు ఖర్చు చేశారు. విమానంలో సౌకర్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్(Israel) లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన టెల్ అవివ్ కు అక్టోబర్ 14 వరకు విమానాల(Flights) రాకపోకల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా తాజాగా రద్దు తేదీని పొడగించింది.
ప్రముఖ దేశీయ విమానయానా సంస్థ ఎయిరిండియా (Air India) యూరోప్‌లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ (Bumper Offer) ప్రకటించింది.