Share News

Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఢీకొన్న విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

ABN , Publish Date - Mar 27 , 2024 | 06:47 PM

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. రన్‌వే పై రెండు విమానాలు అత్యంత చేరువగా రావడంతో.. వింగ్ టు వింగ్ ఢీకొన్నాయి. దీంతో.. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు విరిగాయి. ఒక విమానం చెన్నైకి వెళ్తుండగా, మరొకటి దర్భంగాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది.

Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఢీకొన్న విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో (Kolkata Airport) బుధవారం భారీ ప్రమాదం తప్పింది. రన్‌వే పై రెండు విమానాలు అత్యంత చేరువగా రావడంతో.. వింగ్ టు వింగ్ ఢీకొన్నాయి. దీంతో.. ఇండిగో (IndiGo), ఎయిర్ ఇండియా (Air India) ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు విరిగాయి. ఒక విమానం చెన్నైకి వెళ్తుండగా, మరొకటి దర్భంగాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నైకి వెళ్లే విమానం రెక్కల కొన విరిగిపోగా, మరో విమానం రెక్క కూలిపోయింది.

Miss Universe: చరిత్ర సృష్టించిన ఆ దేశం.. తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో!


ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఆ సమయానికి విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు కూర్చున్నారు. అదే సమయంలో ఇండిగో ఫ్లైట్ 6E 6152 కోల్‌కతా నుండి దర్భంగాకు బయలుదేరడానికి రెడీ అయ్యింది. అందులో 6 క్యాబిన్ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం రన్‌లోకి ప్రవేశించేందుకు క్లియరెన్స్ కోసం ఆగి ఉండగా.. ఇండిగో విమానం ట్యాక్సింగ్ కోసం ప్రయత్నించింది. ఈ సమయంలోనే.. ఎయిర్ ఇండియా విమానం రెక్కకు, ఇండిగో విమానం రెక్క బలంగా తగిలింది. ఈ ఘటన కారణంగా దర్భంగా విమానం టేకాఫ్‌ ఆలస్యమైంది.

AP Politics: పరిపూర్ణానంద స్వామి బిగ్ ట్విస్ట్.. టికెట్ ఇవ్వకపోతే ఆ పని చేస్తా

ఈ ఘటనపై డీజీసీఏ అధికారు మాట్లాడుతూ.. తాము దీనిపై వివరణాత్మకు విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లోని పైలట్‌లు ఇద్దరూ ఆఫ్-రోస్టర్ (నాన్-వర్కింగ్ డే) చేయబడ్డారన్నారు. విచారణ సమయంలో గ్రౌండ్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తామన్న ఆయన.. రెండు విమానాలు తనిఖీ కోసం గ్రౌండింగ్ చేయబడ్డాయని అన్నారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం ప్రయాణికులందరికీ పలు సౌకర్యాలు అందించి, ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 27 , 2024 | 06:53 PM