Air India: ఎయిరిండియాకు రూ.30 లక్షల ఫైన్.. ఎందుకంటే..?
ABN , Publish Date - Feb 29 , 2024 | 02:35 PM
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. విమానం దిగి వస్తోన్న ఓ 80 ఏళ్ల వ్యక్తి పడిపోయాడు. అతనిని తరలించేందుకు వీల్ చైర్ అందుబాటులో లేదు.
ముంబై: ఎయిర్ ఇండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారీ జరిమానా విధించింది. ఓ 80 ఏళ్ల వ్యక్తి విమానం దిగి ఎయిర్ పోర్ట్ టెర్మినల్ వస్తున్నారు. ఆ సమయంలో ప్రయాణికుడు (Passenger) పడిపోయారు. విమానం (Flight) నుంచి ఎయిర్ పోర్టు టెర్మినల్ వరకు తరలించేందుకు ఫ్లైట్‌లో వీల్ చైర్ అందుబాటులో లేదు. ప్యాసెంజర్‌ను ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైంది. చికిత్స అందడం ఆలస్యం కావడంతో ప్రయాణికుడు చనిపోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏపై (DGCA) ఎయిర్ ఇండియాకు (Air India) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఘటనకు సంబంధించి 22వ తేదీన డీజీసీఏకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. దాంతో డీజీసీఏ విచారణ చేపట్టింది. సదరు వ్యక్తి విమానయాన సంస్థ నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని నిర్ధారించి, జరిమానా విధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.