Home » Air india
ఎయిర్ ఇండియా(Air India) విమానం అనగానే ఇన్నాళ్లు మనకో రూపం కనిపిస్తుండేది. ఇకపై ఆ రూపాన్ని మర్చిపోవాల్సిందే. ఎందుకనుకుంటున్నారు? ఎయిర్ ఇండియా డిజైన్ ని పూర్తిగా మార్చేశారండీ. దానికి సంబంధించిన నయా లుక్ ఫొటోలను లోగో(Logo)ను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది.
ఎయిర్ ఇండియా(Air Inida) విమానంలో ఓ వ్యక్తి అత్యుత్సాహంతో ప్రయాణికులు(Passengers) అవస్థలు ఎదుర్కొన్నారు. ఆ వ్యక్తి తోటి ప్రయాణికులపై దుర్భాషలాడుతూ.. ప్రశ్నించిన విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
దేశం నుంచి వివిధ ప్రాంతాల మధ్య సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా(Air India) తాజాగా మరో రెండు ఏరియాల మధ్య నాన్ స్టాప్ సర్వీస్(Non Stop Service) ను పరిచయం చేయనుంది. ఎయిర్ లైన్ అధికారిక ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 23 నుంచి కోల్‌కతా(Kolkata) నుంచి బ్యాంకాక్(Bankok) మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా నడపనుంది.
ఒమాన్, భారత్ మధ్య రాకపోకలు కొనసాగించేవారికి ఒమాన్ ఎయిర్ (Oman Air) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని తిరువనంతపురం (Thiruvananthapuram) కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది.
భారత వైమానిక దళానికి(Indian Airforce) అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం యాడ్ అయింది. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సెప్టెంబర్ 13న వైమానిక దళానికి 56 C-295 రవాణా విమానాలలో మొదటి దాన్ని అందించింది. రూ.21 వేల 935 కోట్ల ప్రాజెక్టు డీల్ లో భాగంగా దీనిని ఎయిర్ ఫోర్స్ కి అందించినట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ సంస్థకు బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే దిల్లీ సర్వీసులో బాంబు అంటూ ఫేక్ కాల్ వచ్చింది.
ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావించేవాళ్ల కోసం ఎయిరిండియా ప్రత్యేకంగా 96 గంటల సేల్ నిర్వహిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం కేవలం ప్రారంభ ధరగా రూ.1,470 చెల్లించి ఈ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు కూడా ఉండదని ఎయిరిండియా వెల్లడించింది.
మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన(Delh to Melbourne) ఎయిర్ ఇండియా విమానం(Air India flight medical emergency) మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మెల్బోర్న్కు తిరిగి వచ్చింది. ఒక గంటకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో విమానాన్ని వెనక్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది.
సదుపాయాలను హుందాగా వినియోగించుకోవలసిన విమాన ప్రయాణికులు ఈమధ్య అనుచితంగా ప్రవర్తిస్తూ, తోటి ప్రయాణికులకు, సిబ్బందికి తలనొప్పిగా మారుతున్నారు. పక్కనున్నవారిపై మూత్ర విసర్జన చేయడం, దాడులకు తెగబడటం వంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. తాజాగా ఓ నేపాలీ జాతీయుడు ఎయిరిండియా విమానం సిబ్బందిని దూషించి, లావేటరీ డోర్‌ను విరిచేశారు.
ఆ విమానంలో మెడికల్ కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిన విద్యార్థులున్నారు. దాదాపు 270 మంది ప్రయాణికులతో ఆదివారం ఢిల్లీ నుంచి పోర్టుబ్లేయర్‌కు ఎయిరిండియా విమానం బయల్దేరింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం సడన్‌గా విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఫ్లైట్‌లో అత్యధికంగా విద్యార్థులే ఉన్నారు. వీరంతా మెడికల్ కౌన్సెలింగ్ వెళ్తున్నారు