Air India : ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు కాల్.. తణుకు వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2023-09-05T11:31:18+05:30 IST
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ సంస్థకు బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే దిల్లీ సర్వీసులో బాంబు అంటూ ఫేక్ కాల్ వచ్చింది.
విజయవాడ : ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ సంస్థకు బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే దిల్లీ సర్వీసులో బాంబు అంటూ ఫేక్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్ ఇండియా, విమానాశ్రయ అధికారులు.. పరిసరాలు క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీల అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు ఎయిర్ ఇండియా సర్వీస్ ఢిల్లీ బయలుదేరింది. ఫేక్ కాల్ చేసిన వ్యక్తి తణుకు పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడిని తణుకులో గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.