Home » Amaravati
వచ్చే మూడు నెలల్లో జల్ జీవన్ మిషన్ను తిరిగి పట్టాలెక్కించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలన్నారు.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని ముంబై నటి కాదంబరి జెత్వానీ హోం మంత్రి అనితను కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విన్నవించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచిత ఇసుక పోర్టల్ను అవిష్కరించనున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు చేస్తూ.. ‘న్యాయ మిత్ర’గా మార్చింది. లా డిపార్ట్మెంట్లో అమలవుతున్న ఈ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేయబడతాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
అమరావతి, (ఉండవల్లి): ఏపీలో వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ.. ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.6,01,116 అందజేశారు.
అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరి లోని సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.
అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరి లోనే సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.
నటి కాదంబరి జత్వానీ ముందుగా ఏపీ మహిళా కమిషన్ను ఎందుకు ఆశ్రయించలేదని బాధితురాలిపైనే ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ప్రశ్నలు సంధించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళకు అన్యాయం జరిగితే మాకు సంబంధం లేదని అంటావా అంటూ ఆమెపై తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు.
‘‘నా బిడ్డకి బ్లడ్ కేన్సర్. జూనియర్ ఎన్టీయార్కి వీరాభిమాని. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ‘అమ్మా దేవర సినిమా చూసి చచ్చిపోతా.. 27వ తేదీ దాకా నన్ను బతికించండి..’ అని వేడుకుంటున్నాడు’’ అంటూ 19 ఏళ్ల కౌశిక్ తల్లి సరస్వతి కన్నీరు మున్నీరవుతూ వెల్లడించారు.
ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొందరు అధికారులు ఉన్న చోటే తిష్ఠ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.