Home » Amit Shah
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు దేశవ్యాప్తంగా పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకోవద్దన్న నిబంధనను ఉల్లంఘించిన కేసులో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి పేర్లను తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందున బీజేపీ సీనియర్ నేతలు సోమవారం భేటీ అయ్యారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు సాధించడం పక్కా అని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ హవా స్పష్టంగా కనిపించిందని పేర్కొంటున్నారు. దీంతో పాటు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంతో ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షాపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. చివరి దశ ఎన్నికలు ముగిశాక..
దాదాపు 150 మంది జిల్లా కలెక్టర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్లు చేసి బెదిరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందించింది. ఈ మేరకు ఏ ఒక్క కలెక్టరు నుంచి తమకు ఫిర్యాదులు అందలేదని తెలిపింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో సతీమణి సోనాల్ షాతో కలిసి ఆలయంలోకి వెళ్లి ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు.
దేశం కోసం 100 సార్లైనా జైలుకి వెళ్లడానికి సిద్ధమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన పోలీసులకు తిరిగి లొంగిపోవాల్సి ఉంది.
తిరుపతి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం తిరుమల రానున్నారు. ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు రేణిగుంటకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.