Delhi: దేశం కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా.. గర్వంగా ఉందన్న కేజ్రీవాల్
ABN , Publish Date - May 30 , 2024 | 02:07 PM
దేశం కోసం 100 సార్లైనా జైలుకి వెళ్లడానికి సిద్ధమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన పోలీసులకు తిరిగి లొంగిపోవాల్సి ఉంది.
జలంధర్: దేశం కోసం 100 సార్లైనా జైలుకి వెళ్లడానికి సిద్ధమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన పోలీసులకు తిరిగి లొంగిపోవాల్సి ఉంది.
ఈ క్రమంలో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించడానికి జైల్లో ఉండటానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
"నేను స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అనుచరుడిని. దేశం కోసం ఎన్ని సార్లైనా జైలుకి వెళ్తా. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల కంటే తక్కువ గెలుచుకుంటుంది. ఇండియా కూటమి 300 సీట్లకు పైగా గెలుచుకుంటుంది. నేను అవినీతికి పాల్పడ్డానని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ సాక్ష్యాలు చూపించలేకపోతోంది. నేను అవినీతి చేస్తే ప్రపంచంలో ఇక ఎవరూ నిజాయతీపరులు మిగలరు. లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు దోచుకున్నారని అంటున్నారు. 500 చోట్ల దాడులు చేస్తే ఒక్క రూపాయి కూడా దొరకలేదు. అంటే వంద కోట్లు గాలిలో మాయమైపోయాయా. తమ వద్ద సాక్ష్యాలు లేవని, రికవరీ చేయలేదని, కేజ్రీవాల్ అనుభవజ్ఞుడైన దొంగ అని ప్రధాని మోదీ అన్నారు. సాక్ష్యాలు లేవని ప్రధాని అంగీకరించారంటేనే లిక్కర్ స్కాం అనేది ఫేక్ అని అర్థం చేసుకోవచ్చు.
నేను చేస్తున్న పనిని మోదీ చేయలేదు. అందుకే నన్ను అరెస్ట్ చేశారు. పంజాబ్, ఢిల్లీవాసులకు విద్యుత్తును ఉచితంగా అందించాం. మంచి ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకొచ్చాం. మోదీ ఇవ్వని చేయలేదు. అందుకే నన్ను జైలులో పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ గొంతు అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా మమ్మల్ని ఆపలేదు. నేను జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను.దేశాన్ని రక్షించుకోవడానికి జైలుకు వెళ్తున్నందుకు గర్వపడుతున్నాను. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నించిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.ఇలాంటి గుండాగిరిని ఇంతకు ముందు చూడలేదు. దీనికి వ్యతిరేకంగా మేం గళం విప్పుతున్నాను. అలాంటి గుండాగిరికి వ్యతిరేకంగా నేను జైలుకు వెళతాను" అని కేజ్రీవాల్ అన్నారు.
పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న చివరి దశలో పోలింగ్ జరగనుంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ రాష్ట్రంలో విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
For more Latest News and Technology News click here