Share News

Hyderabad: అమిత్‌ షాను కేసు నుంచి తప్పించే ప్రయత్నం

ABN , Publish Date - Jun 04 , 2024 | 05:17 AM

ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకోవద్దన్న నిబంధనను ఉల్లంఘించిన కేసులో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి పేర్లను తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ కోరారు.

Hyderabad: అమిత్‌ షాను కేసు నుంచి తప్పించే ప్రయత్నం

  • పోలీసులపై ఈసీ చర్యలు తీసుకోవాలి: నిరంజన్‌

ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకోవద్దన్న నిబంధనను ఉల్లంఘించిన కేసులో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి పేర్లను తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ కోరారు. హైదరాబాద్‌లో మే 1న జరిగిన అమిత్‌షా ర్యాలీలో పిల్లలు బీజేపీ జెండాలను పట్టుకుని పాల్గొన్నారని, దీనిపై ఈసీకి అదే రోజున ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మే 2న మొఘల్‌పురా పోలీ్‌సస్టేషన్‌లో అమిత్‌షా, కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌, మాధవీలత, యమన్‌సింగ్‌ పేర్లతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్నారు. అయితే భౌతిక సాక్ష్యాధారాల ప్రకారం అమిత్‌షా, కిషన్‌రెడ్డిల ప్రమేయం నిర్ధారణ కానందున కేసు నుంచి వారి పేర్లను తొలగించామని ఆ స్టేషన్‌ పోలీసులు తనకు పంపిన నోటీసులో పేర్కొన్నారన్నారు.


కేసును తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. వారిపై విచారణ జరిపించాలని ఈసీని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌ విషం కక్కుతున్నారని ఆ పార్టీ నేతలు గజ్జెల కాంతం, సతీశ్‌ మాదిగ ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు నియంతలా పాలించిన ఆయన.. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రె్‌సకు పరిపాలించడం చేతగాదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమెరికాలో ప్రభాకర్‌రావును హరీశ్‌రావు కలిసినట్లుగా ఆధారాలున్నాయని, దానికి సంబంధించిన ఫొటోలు బయటపెడితే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్‌ విసిరారు.

Updated Date - Jun 04 , 2024 | 05:17 AM