కలెక్టర్లకు ఫోన్‌లో షా బెదిరింపులు: జైరాం
ABN , Publish Date - Jun 03 , 2024 | 05:18 AM
దాదాపు 150 మంది జిల్లా కలెక్టర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్‌లు చేసి బెదిరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందించింది. ఈ మేరకు ఏ ఒక్క కలెక్టరు నుంచి తమకు ఫిర్యాదులు అందలేదని తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 2: దాదాపు 150 మంది జిల్లా కలెక్టర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్‌లు చేసి బెదిరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందించింది. ఈ మేరకు ఏ ఒక్క కలెక్టరు నుంచి తమకు ఫిర్యాదులు అందలేదని తెలిపింది.
ఆ ఫోన్ కాల్స్‌కు సంబంధించి సమాచారం అందించమని జైరాం రమేశ్‌ను కోరింది. జిల్లా కలెక్టర్లకు అమిత్‌షా ఫోన్‌లు చేసి బెదిరించారని, ఇది బీజేపీ ఎంత నిరాశతో ఉందో తెలియజేస్తున్నదని, అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయాలని రమేశ్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు.
అలాంటి వారికి బెదిరింపులు వచ్చాయని ఓ బాధ్యత కలిగిన సీనియర్ నేత వ్యాఖ్యానించడం ప్రజల్లో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోందని, కాబట్టి ఇందుకు సంబంధించిన వివరాలు అందించాలని, చర్యలు తీసుకుంటామని రమేశ్‌కు ఈసీ తెలిపింది.