Home » Anantapur urban
ప్రతి రైతు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. మండలంలోని తలుపూరు, వడ్డుపల్లి గ్రామాల్లో బుధవారం ఈ పంట నమోదును జిల్లా వ్యవసాయ అధికారులతో కలసి కలెక్టర్ సూపర్ చెక్ చేశారు.
గ్రామాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం హిందూ శ్మశానవాటిక సౌకర్యార్థంతో పాటు సమీప కాలనీలకు రహదారి నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.14లక్షల నిర్మాణ వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఉద్యాన పంటలు ఊపిరి లాంటివని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. బుధవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, మండలాలకు చెందిన హార్టికల్చర్ అధికారులు ఎమ్మెల్యేను కలిశారు.
అనంతపురం అర్బన పరిధిలో లక్ష మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక 43వ డివిజన ఐదో రోడ్డులో సాయి బాబా ఆలయం వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని సీపీఐ, ఇన్ఫాఫ్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయా సంఘాల నాయకులు సప్తగిరి సర్కిల్లో నిరసన తెలిపారు.
ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఆరోరోజున మంగళవారం హనుమద్ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్లకు సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, తోమాల సేవ నిర్వహించా రు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున మంగళవారం అమ్మ వారు పలుప్రాంతాల్లో లక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో మూలవిరాట్లతోపాటు ఉత్సవమూ ర్తులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించా రు. కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను వక్కలతో అలంకరించి, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తులతో కంచి కా మాక్షి, వాసవీదేవి, సంతోషిమాత అలంకారం చేశారు.
ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు సోమవారం శ్రీనివాసుడు గరుడవాహనంపై కనువిందు చేశాడు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్లకు వి విధ అభిషేకాలు, కుంకుమార్చన, తోమాలసేవ, అలంకారసేవ నిర్వ హించారు.
సమస్యలను పరిష్కరించాలని బా ధతులు కలెక్టరేట్‌కే క్యూకట్టారు. గతవారం జిల్లాకేంద్రంలోని డీఆర్డీఏ కార్యా లయంలో అనంత రెవెన్యూ డివిజన గ్రీవెన్స మొదలు పెట్టి, కలెక్టరుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీంతో గత సోమ వారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి గ్రీవెన్సకు కేవలం112అర్జీలు మా త్రమే వచ్చాయి.డివిజన స్థాయి గ్రీవెన్సకు 290వరకు వచ్చాయి.
నగర పాలక సంస్థ పరిధిలోని కమలానగర్లో పారిశుధ్య నిర్వహణ లోపంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ పేరుతో దగ్గుపాటి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు సోమవారం ఉదయం 7 గంటల నుంచి స్థానిక కమలానగర్లో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.