Share News

COLLECGTOR: ఈ-పంట నమోదు చేయించుకోండి: కలెక్టర్‌

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:47 PM

ప్రతి రైతు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. మండలంలోని తలుపూరు, వడ్డుపల్లి గ్రామాల్లో బుధవారం ఈ పంట నమోదును జిల్లా వ్యవసాయ అధికారులతో కలసి కలెక్టర్‌ సూపర్‌ చెక్‌ చేశారు.

COLLECGTOR: ఈ-పంట నమోదు చేయించుకోండి: కలెక్టర్‌
Collector and officials inspecting the crop field

ఆత్మకూరు, అక్టోబరు 9: ప్రతి రైతు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. మండలంలోని తలుపూరు, వడ్డుపల్లి గ్రామాల్లో బుధవారం ఈ పంట నమోదును జిల్లా వ్యవసాయ అధికారులతో కలసి కలెక్టర్‌ సూపర్‌ చెక్‌ చేశారు. సాగు చేసిన పంటలను అధికారులు సక్రమంగా నమోదు చేశారా లేదా అని రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏడీఏ రవికుమార్‌, ఎఓ సుచరిత, తహసీల్దార్‌ లక్ష్మీనాయక్‌, ఎంపీడీఓ లక్ష్మీనరసింహస్వామి, సర్పంచ లక్ష్మినారాయణరెడ్డి పాల్గొన్నారు.

సూపర్‌ చెక్‌

అనంతపురంరూరల్‌: మండలంలోని పూలకుంట గ్రామంలో కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఈ-పంట నమోదు సూపర్‌ చెక్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు అక్కమ్మకు చెందిన దానిమ్మ తోటలో కార్యక్రమాన్ని నిర్వహించి అందులో వచ్చిన డేటాని నిర్ధారించారు. దానిమ్మ పంటను ఎప్పుడు సాగు చేశారు, బోరు ఉందా, నీరు బాగా వస్తున్నాయా, ఎన్ని ఎకరాల్లో పంటను సాగు చేశారు తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. టెక్నికల్‌ అధికారి శంకర్‌ లాల్‌, ఏఓ శశికళ, ఎంపిటీసీ భాస్కర్‌రెడ్డి, వీహెచఏ కవిత, ఎంపీఈఓ శ్రావణి పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 11:48 PM