Home » Anantapur urban
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న నూతన మద్యం పాలసీని... మహిళలు, ప్రజల మానప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఉపసంహ రించుకోవాలని మహిళా సంఘాల జేఏసీ నాయకురాలు, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి డిమాం డ్ చేశారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం క్లాక్‌టవర్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన అసోసియేషన ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించారు. మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. స్వచ్ఛతాహి సేవా ప్రాధాన్యతపై సభ్యులు, క్రీడాకారులు ప్రతిజ్ఞ చేశారు.
స్థానిక జిల్లా ట్రాన్సపోర్ట్ కార్యాలయంలో బుధవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఇందులో భాగంగా జిల్లా ట్రాన్సపోర్టు అధికారి వీర్రాజు, ఆర్టీఓ సుధాకర్ నాయుడు, ఎంవీఐలు శ్రీనివాసులు, శ్వేత బిందు, ప్రసాద్, పరిపాలన అధికా రి కామరాజు తదితరులు కార్యాలయ పరిసరాల్లో చెత్తను తొలగించారు.
సత్యం, అహింసే ఆయుధంగా ఆంగ్లేయులతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మగాంధీ 155వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళి అర్పించారు. నగరంలోని గాంధీ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు.
తమకు తక్కువ వేతనాలు ఇస్తూ, ఎక్కువగా పనిచేయించుకుంటున్నారని, అంతేగాకుండా తమకు ఎలాంటి గౌరవం లేదని గ్రామ/వార్డు సచివాలయాల ఏఎనఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. తమను వైద్యశాఖలో కలపాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయ ఏఎనఎంలు స్థానిక కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకుని ఆందోళన సాగించారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూ సేకరణ పనులు త్వరగా చేప ట్టాలని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదే శించారు. కలెక్టరేట్లో సోమవారం భూసేకరణపై సమీక్ష నిర్వహిం చారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూభవనలో నిర్వహిం చిన జిల్లా స్థాయి గ్రీవెన్సడేకి బాధితుల సందడి తగ్గింది. గతంలో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో మాత్రమే పిర్యాదుల స్వీకరణ కొనసాగేది. అయితే కలెక్టరు ఈ సారి అనంత రెవెన్యూ డివిజన కార్యాలయం (ఆర్డీఓ)లో డివిజన ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స ఏర్పాటు చేశారు.
అధికార మార్పిడి జరిగినంత మాత్రాన సమసమాజ స్థాపన సాధ్యం కాదని, పాలకవర్గ స్వభావంలోనే మార్పు రావాలని కేరళ ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఆచార్య వీకే రామచంద్రన పేర్కొన్నారు.
బాధాసర్పద్రష్టులైన ప్రజల జీవిత మూలాలను సూత్రప్రాయంగా వ్యక్తీకరించిన కవుల కవిత్వాన్ని విస్తృతమైన వ్యాఖ్యానంతో పాఠకునికి చేరవేయడమే కవిత్వ విమర్శ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ బధిరుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం ఆవరణంలోని ఆడిటోరియంలో కేక్‌కట్ చేసి సైగలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కుమార్ మాట్లాడుతూ... ప్రజలు సైగల భాషను ఆకళింపు చేసుకునేలా ప్రభుత్వం తగు సూచనలు చేయాలని కోరారు.