Home » Anantapur urban
పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండటం మంచిదని ఎస్పీ జగదీష్ అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని షాదీఖానాలో శుక్రవారం ఓపెన హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
ఇకపై నగరంలో గుంతల రోడ్లు, చెత్తా, చెదారం కనిపించకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. ఆయన శుక్రవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో నగరపాలిక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అం శాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు.
నేను అవినీ తికి పాల్పడను... ఎవ్వ రికి భయపడను ... ’అంటూ కోపంతో సర్వ సభ్య సమావేశం నుంచి తహసీ ల్దారు అరుణకుమారి వెళ్లి పోయారు. స్థానిక మండలపరిషత కార్యాల యంలో గురువారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశం వాడివేడిగా జరిగింది.
కలెక్టర్ వినోద్ కుమార్ ముందుచూపు వలనే వరద నష్టం బాగా తగ్గిందని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు బుధవా రం రాత్రి అనంతపురం రూరల్ పంచాయతీ గ్రామ సచివాలయం-2లో నిత్యవసరాల పంపిణీ చేపట్టారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరై ఐదు రకాల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
అనం తపురం నంచి తాడిపత్రి వరకు నేషనల్ హైవే సిక్స్ లైన రోడ్డు పనులు జరగుతున్నాయి. అయితే ఈ ప నుల్లో శింగనమలకు వెళ్లేందుకు అధికా రులు సరైన మార్గం చూపకపోవడంతో గ్రామస్థులు, ప్రయాణికు లు గందరగొళంలో ఉన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించినా అధికారులు స్పందించకపో వడంతో... శింగనమల ప్రజలు, శింగనమలకు రాకపోక లు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని వీర శైవ లింగాయతులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని టీడీపీ వీరశైవ లింగాయత సాధికార సమితి రాష్ట్ర డైరెక్టర్ సాంబశివుడు కోరారు. ఆ మేరకు మంగళవారం హైదరాబాదులో జరిగిన ఓబీసీ సమీక్షా సమావేశంలో జాతీయ ఓబీసీ కమిటీ చైర్‌పర్సన గణేష్ సింగ్‌కు జాతీయ ఓబీసీ కమిటీ సభ్యుడు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని కాలనీల ప్రజలకు అన్నివిధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అర్బన నియోజకవర్గం పరిధి లోని అనంతపురం రూరల్ పంచాయతీ రామకృష్ణకాలనీ, నారా లోకేశ కాలనీ, సుశీలరెడ్డి కాలనీ, తిమ్మానాయుడు కాల నీ, అభ్యుదయ కాలనీల్లోకి వరదనీరు చేరింది.
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉం టుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వివిధ డిమాండ్లతో ఆందోళనలు చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్నందు న వాటన్నింటిని నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ పేర్కొన్నారు. జిల్లాకు సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 19వ వరకు జిల్లావ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు.