Home » Anantapur
ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేసేది, దేశం లో ప్రజలకు కష్టం వస్తే అండగా నిలిచేది కమ్యూని స్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాం భూపాల్ పేర్కొన్నారు. స్థానిక గణేనాయక్ భవనలో ఆదివారం నిర్వహించిన సీపీఎం నగర ఎనిమిదో మహాసభలో రాంభూపాల్ ప్రసంగించారు. పాలకులు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలు వెంటనే చూసేది కమ్యూనిస్టుల వైపే అన్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ప్రజాసమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని, అందుకే ప్రజలు ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టు నాయకులవైపు చూస్తారన్నారు.
మండల కేంద్రం సమీపంలో ఉన్న ఆటో నగర్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధాన రోడ్లు, లింక్ రోడ్లు అద్వానంగా ఉన్నాయి. భారీ గుంతలు ఏర్పడటంతో వర్షపు నీరు ఎక్కువగా నిలిచి బురదమయంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటూ ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నగర్లో చాలా వరకు వీధిలైట్లు కూడా లేకపోవడంతో చీకటి మయం గా ఉంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులతో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ రెచ్చిపోయాడు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. కోర్టు అనుమతితో అనిల్ను అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు.
మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సుబ్ర హ్మణ్య షష్ఠి సందర్భంగా శనివారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామి వా రికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటంక గ్రామానికి చెందిన ఆవు ల నాగలక్ష్మి, ఆవుల కంచెప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సన్ని కన్నుల పండువగా జరిపిం చారు.
విద్యార్థులు తమ ఉజ్వల్ భవిష్యత కోసం బాగా చదువు కోవాలని జిల్లా గ్రంథాల యాల సంస్థ మాజీ చైర్మన గౌస్మోద్దీన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని పాఠశాలల్లో పండుగలా నిర్వ హించారు. కల్లూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్ర మానికి జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు.
మీ ఇంటిని ఇలాగే పెట్టుకుంటారా..? మీ ఇంట్లో పల్లలకు ఇలాంటి భోజనమే పెదతారా అంటూ విజిలెన్స డీఎస్పీ నాగభూషణం బీసీ బాయ్స్ హాస్టల్-2 వార్డెన భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనరస య్య కాలనీ గంగమ్మ గుడి సమీపంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్-2ను ఆయన శనివారం విజిలెన్స సీఐ శ్రీనివాసు లు, ఏఓ వాసుప్రకాష్తో అకస్మికంగా తనిఖీ చేపట్టారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలను అసభ్య పదజాలంతో ధూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. అనంతపురం కేసులో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అతన్ని అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
మండలంలోని బండ్లపల్లి జడ్పీ పాఠశాలలో గురువారం ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ రేకులకుంట వ్యవసాయ పరిశోఽ దన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త విజయశేఖర్బాబు, అనంతపురం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ రోజాపుష్పలత, తాడిపత్రి డివిజన ఏడీఏ చంగల్రాయుడు, బండ్లపల్లి జడ్పీహెచఎస్ హెచఎం శేషగిరి, మండల వ్యవసాయ అధికారి చెన్నవీరస్వామి హాజరయ్యారు.
రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడానికి ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వి.రత్న సూచించారు. రామగిరి పోలీస్సర్కిల్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి పోలీస్స్టేషన్లను ఎస్పీ గురువారం తనిఖీ చేశారు. ఆయా స్టేషన్లలో రికా ర్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ప్రధానంగా సమస్యాత్మక గ్రామాలతో పాటు ఫ్యాక్షన గ్రామాల పరిస్థితి గురించి డీఎస్పీ శ్రీనివాసు లు, సీఐ శ్రీధర్తో ఆరాతీశారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీ వ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గు రువారం అనంతపురం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. గతంలో చెన్నేకొత్తపల్లి, రామ గిరి, రాప్తాడు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు.