Home » Anathapuram
పోలింగ్ పూర్తయినా వైసీపీ వర్గీయుల అరాచకాలు మాత్రం తగ్గడంలేదు. అనంతపురం నగరంలో అధికార పార్టీ కార్యకర్త మల్లికార్జున రెడ్డి మద్యం సేవించి.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ జనాన్ని బెంబేలెత్తించాడు. ‘జై జగన్.. జై వైఎస్సార్’ అంటూ గురువారం సాయంత్రం కారును వేగంగా.....
ఏపీ ఎన్నికల సంఘానికి (Election Commission) తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపకర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగలింది. బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్ ప్రభాకర్ రెడ్డిపై ED ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ దాఖలు చేసింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్(Sake Sailajanath) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
అనంతపురంలో(Ananthapuram) సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కి.మీ.లు కారుతోసహా లాక్కెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
టీడీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డితో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) ఆదివారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా సయోధ్య నారా లోకేష్ కుదిర్చారు.
జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం రోటరిపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (SRIT) కళాశాలల్లో కవిత (21)అనే విద్యార్థిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుకుంటుంది.
జిల్లాలోని ధర్మవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.