Share News

CM Chandrababu: కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది

ABN , Publish Date - Aug 05 , 2024 | 07:50 PM

కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ ప్రభుత్వం రూ.3,183 కోట్లు డైవర్ట్ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఆరోపించారు.

CM Chandrababu: కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది
CM Nara Chandrababu Naidu

అమరావతి: కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ ప్రభుత్వం రూ.3,183 కోట్లు డైవర్ట్ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఆరోపించారు. రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.1,603 కోట్లు ఇవ్వలేదని, దీనిపై కేంద్రం రూ. 28 కోట్లు ఫైన్ వేసిందనిగుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గృహనిర్మాణ డబ్బులు మరో రూ.500 కోట్లను డైవర్ట్ చేసిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం నుంచి రూ. 8 వేలకోట్లు రాకుండా చేసిందని విమర్శించారు. కార్పొరేషన్లు రూ.5వేలు కోట్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సింది రూ. 3,500 కోట్లు రాకుండా మాజీ సీఎం జగన్ చేశారని ఆరోపించారు. మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడం, డబ్బులు డైవర్ట్ చేయడం, క్లైమ్ చేయకపోవడం వల్ల ప్రజలు చాలా నష్టపోయారని సీఎం చంద్రబాబు అన్నారు.


సత్య సాయి ట్రస్ట్ విషయంలో కీలక నిర్ణయాలు

పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ విషయంలో కలెక్టర్ కాన్పరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయిబాబా దగ్గర డబ్బులు లేవు అయితే అనంతపురానికి తాగునీరు అందించాలనే తపన ఉందని చెప్పారు. అందుకే రూ.200 కోట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఆ వాటర్ ప్రాజెక్టులను తన డివోటీస్ అయిన ఎల్ అండ్ టీని పెట్టి నిర్వాహణ చేయమని ఆయన కోరారు.

వైసీపీ ప్రభుత్వంలో అక్కడ తాగునీరు ఇచ్చేందుకు చేయాల్సిన నిర్వహణకు డబ్బులు ఇవ్వకుండా మూసేశారని అన్నారు. సత్యసాయి ఓ మంచి ఉద్దేశంతో అప్పగించిన ప్రాజెక్టును ఆయన చనిపోతే మెయింటెనెన్స్ చేయకుండా జీతాలు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం దీని బాధ్యతను చేపట్టి ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. దోమల నివారణకు మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్, పంచాయతీరాజ్, హెల్త్‌లు కోఆర్డినేషన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


వేస్ట్ టూ ఎనర్జీ పవర్ ప్రాంట్ పెట్టి ప్రైవేట్ వారిని గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో అట్రాక్ట్ చేశామని చెప్పారు. రూరల్ ఏరియాలో లిక్విడ్ వేస్టు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూడాలని సూచించారు. వేస్టును కలెక్ట్ చేసి ఇచ్చే బాధ్యత కలెక్టర్‌లదేనని, అలా ఇస్తే వారు గార్బేజిని పవర్ కింద మార్చుకుంటామన్నారని తెలిపారు. ఏ మున్సిపాలిటీల్లో చెత్త కనపడకూడదని , రోడ్లు అన్ని పీపీపీ పద్ధతిలో నిర్వహణకు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా గుంతలు ఉంటే వారే పూడుస్తారని అన్నారు.

అర్బన్ ఏరియాల్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటే ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పైప్‌లైన్స్ వేసిన విధానం అన్ ఈవెన్‌గా వేశారన్నారు. జలజీవన్ మిషన్‌లో నిధులు కేంద్రం ఇస్తోందని... దీనిలో ఏపీ చివరిలో ఉందని వెంటనే దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. దీనిపై టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పనిచేయాలని సూచించారు. అన్న క్యాంటిన్‌లను సమర్ధంగా నిర్వహించాలని.. దీనికి టీటీడీ మాదిరి డొనేషన్లు వస్తున్నాయని.. వీటికోసం కలెక్టర్లు మరింత ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Updated Date - Aug 05 , 2024 | 08:33 PM