Share News

ABN Effect: ఆప్కో చేనేతలో అక్రమాలపై మంత్రి సవిత రియాక్షన్

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:29 PM

Andhrapradesh: ఆప్కో చేనేతలో జరిగిన అక్రమాలపై ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారని విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా ఆప్కో, చేనేతలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపడుతామని తెలిపారు.

ABN Effect: ఆప్కో చేనేతలో అక్రమాలపై మంత్రి సవిత రియాక్షన్
Minister Savita

అనంతపురం, జూలై 12: ఆప్కో చేనేతలో జరిగిన అక్రమాలపై ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతిలో (ABN- Andhrajyothy) వచ్చిన కథనంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత (Minister Savita) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రి అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారని విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా ఆప్కో, చేనేతలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపడుతామని తెలిపారు. ఆప్కో చేనేత కార్మికులను స్వలాభం కోసం నాశనం చేశారన్నారు.

Peddireddy: పెద్దిరెడ్డికి మరో ఊహించని షాక్..


ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు చేనేత కార్మికులు వలస వెళ్తున్నారన్నారు. చేనేత రంగాన్ని రాష్ట్రంలో నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జరిగిన అన్నింటిపైనా విచారణ జరిపిస్తామన్నారు. నేతన్న నేస్తం పేరుతో వైసీపీ కార్యకర్తలకు నేతన్న నేస్తం ఇచ్చారన్నారు. సబ్సిడీపై ముడిసరుకు పనిముట్లు ఇస్తున్నామన్నారు. సొసైటీలను ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకు పెద్ద పీటవేశారన్నారని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులైన ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

YS Sharmila: చంద్రబాబు నెల పాలనపై షర్మిల కామెంట్స్

Delhi Liquor Case: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2024 | 04:59 PM