Home » Annamalai
విక్రవాండి శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నాడీఎంకేను పతనావస్థకు తీసుకెళుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి అందరి వద్దా ‘నమ్మకద్రోహి’ అనే పేరు తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమిని మనసులో పెట్టుకుని ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా, రాష్ట్రంలో కమలం వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) పిలుపునిచ్చారు.
తమిళనాడు బీజేపీలో వర్గపోరు చల్లబడినట్లే కనిపిస్తోంది. ఇటీవల తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ గవర్నర్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌తో అధ్యక్షుడు అన్నామలై తాజాగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని సాలిగ్రామంలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో గంటపాటు సమావేశమయ్యారు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమావేశమయ్యారు. శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం అన్నామలై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళిసైతో భేటీ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవం వేదికపై తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ కీలక నేత తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ చక్కగా పనిచేసినట్టుగా అనిపిస్తోంది.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెంచిన ఉత్సాహంతో ఢిల్లీ వెళ్ళిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు.
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది. అయితే ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది అత్తెసరు మెజారిటీతో ఓడిపోగా, మరి కొందరు భారీ మెజారిటీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు.
తెలంగాణ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై(Annamalai) అన్నారు.
సంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ..
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలైకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2022లో క్రిస్టియన్లపై అన్నామలై విద్వేష ప్రసంగం చేశారంటూ దాఖలైన క్రిమినల్ కేసు విచారణపై గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టేను అత్యున్నత న్యాయస్థానం సోవారంనాడు పొడిగించింది. సెప్టెంబర్ 9వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.