BJP: అన్నాడీఎంకేతో కూటమి వద్దు.. మాకు అన్నామలై కావాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:26 PM
మాకు అన్నామలై కావాలి.., అన్నాడీఎంకేతో కూటమి వద్దు.. అంటూ వెలిసిన పోస్టర్లు తమిళనాట కలకలం పుట్టిస్తున్నాయి.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పోస్టర్లు వెలుగుచూడడంతో ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది.

- రామనాథపురంలో వెలసిన పోస్టర్లు
చెన్నై: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై(BJP State President Annamalai) కావాలి, అన్నాడీఎంకేతో కూటమి వద్దంటూ రామనాథపురంలో అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిపై ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను ఈ పదవి నుంచి తప్పించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం
ఈ నేపథ్యంలో, రామనాధపురం(Ramanathapuram) బీజేపీ జిల్లా కార్యదర్శి, మేల్‌కొడుమలూరు పంచాయతి యూనియన్ అధ్యక్షుడు సెయ్యామంగళం కె.శరవణన్ పేరుతో పరమకుడిలో వెలిసిన వాల్‌పోస్టర్లలో... ‘వేండుమ్...వేండుమ్... రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై వేండుమ్... వేండామ్... వేండామ్, అన్నాడీఎంకేతో కూటని వేండామ్.... అంటూ ముద్రించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొత్త తల్లులు గిల్ట్ లేకుండా..
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News