Share News

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:42 PM

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు.. ఆయన వచ్చాకే పార్టీ చాలా డవలప్ అయింది.. అంటూ నగరంలో పలుచోట్ల వాల్‌పోస్టర్లు వెలిశాయి. అన్నామలైని మారుస్తున్నారంటూ ఇటీవల ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో ఆయనను మార్చొద్దంటూ నగరంలో పలుచోట్ల ఈ వాల్‌పోస్టర్లు వెలవడం ఇప్పుడు చర్చానీయాంశమైంది.

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు

- వెలిసిన వాల్‌పోస్టర్లు

చెన్నై: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP State President Annamalai)ను మార్చొద్దంటూ నగరంలో పలుచోట్ల వాల్‌పోస్టర్లు వెలిశాయి. ఇటీవల పరమకుడిలో కనిపించిన ఈ పోస్టర్లు ఇపుడు అంబత్తూరు, పాడి, కొరట్టూరు తదితర ప్రాం తాల్లో వెలిశాయి. ఈ పోస్టర్లలో ‘అన్నామలైను మార్చొద్దు.. అన్నాడీఎంకే కూటమిలో కొనసాగాలి’ అంటూ ముద్రించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వచ్చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: Kaveri Hospital: 4 నెలల పసికందుకు కాలేయ మార్పిడి


ఆ సమయంలో అన్నామలైపై అన్నాడీఎం కే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య స్నేహం చెడింది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ వెళ్ళి కమలనాథులను కలిసిన ఎడప్పాడి. పార్టీ అధ్యక్షపదవి నుంచి అన్నామలైను తొలగించాలని డిమాండ్‌ చేసినట్టు సమాచారం.


nani6.2.jpg

దీనికి బీజేపీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి అన్నామలైను తప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇది బీజేపీ రాష్ట్ర శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారంపై ఆ పార్టీ సీనియర్‌ నేతలు గుంభనంగా ఉండగా ద్వితీయ శ్రేణి యువ నేతలు మాత్రం అన్నామలైకు జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నామలైకు అనుకూలంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలుస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 01:43 PM