Home » Annamayya
ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు వర్గాలు వివిధ సమస్యలు పరిష్కరిం చాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించాయి.
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన అన్నమయ్య జిల్లా ఇనచార్జి గుంటి వేణుగోపాల్, యూనియన రాష్ట్ర అధ్యక్షురాలు పీ.సుభాషిణి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకుంటామని ఇక వారి ఆటలు సాగనివ్వమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం వెల్లడించారు.
సివిల్ సప్లైస్ హ మాలీల సమస్యలను పరిష్కరిం చాలని హమాలీ వర్కర్స్ యూని యన నాయకుడు మురళి డి మాండ్ చేశారు.
గాలేరు - నగ రి సుజల స్రవంతి ద్వారా రాబోయే రోజుల్లో గుంజనేరుకు అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన ద్వారా చెరువులకు నీరందించడంపై ముఖ్య మంత్రితో చర్చించామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.
నియోజకవర్గంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోనే పలు అభివృద్ధి పనులు అమలు చేశామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. మండల పరిధిలోని కాకర్లవారిపల్లె గ్రామ పంచాయతీలో సుమారు రూ7.52 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానంద రెడ్డితో కలసి భూమి పూజ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగు తీస్తోందని నియోజకవర్గ టీడీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు.
మండలంలోని మా న్యం భూములు ఆక్రమణకు గురయ్యాయని జి ల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. బుధవారం మండలంలోని సుండుపల్లెమ్మ, కార్తి కేయ నగర్‌లోని సుబ్రమణ్యంస్వామి, ఓదేటమ్మ ఆలయాల మాన్యం భూములను ఆయన పరి శీలించారు.
వరద నష్ట పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం వివక్ష పాటించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తమను ఆదుకోవాలని అన్నమయ్య ప్రాజెక్టు ముంపుబాధిత గ్రామాల ప్రజలు సబ్‌కలెక్టరు వైఖోం నిధియాదేవికి విన్నవించారు.