Home » AP Assembly Speaker
నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.
స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. సభా సంప్రదాయాలు ప్రకారం నిన్ననే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికారపక్షం చెప్పింది. అయినా కూడా ఆ పార్టీ అధినేత స్పీకర్ ఎన్నిక పట్ల ఆసక్తి కనబరచకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ రావడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవమైంది.