Share News

AP Assembly: ఏపీ శాసనసభలో కొత్త సంప్రాదాయానికి శ్రీకారం.. స్పీకర్ చొరవతో మాతృభాషకు పెద్దపీట..

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:44 PM

తెలుగు భాష గొప్పతనాన్ని, భాషలో మాధుర్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఎన్ని భాషలున్నా.. తెలుగుభాష ప్రత్యేకతే వేరు. మారుతున్న కాలంలో మాతృభాషను మర్చిపోతున్న వేళ.. ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అరుదైన ఘటన మాతృభాష ప్రేమికులకు మిక్కిలి సంతోషానిస్తోంది.

AP Assembly: ఏపీ శాసనసభలో కొత్త సంప్రాదాయానికి శ్రీకారం.. స్పీకర్ చొరవతో మాతృభాషకు పెద్దపీట..
Ayyannapatrudu

తెలుగు భాష గొప్పతనాన్ని, భాషలో మాధుర్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఎన్ని భాషలున్నా.. తెలుగుభాష ప్రత్యేకతే వేరు. మారుతున్న కాలంలో మాతృభాషను మర్చిపోతున్న వేళ.. ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అరుదైన ఘటన మాతృభాష ప్రేమికులకు మిక్కిలి సంతోషానిస్తోంది. శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనూ, ఆమోదం సమయంలోనూ పూర్తిగా తెలుగు భాషను ఉపయోగించాలనే ఉద్దేశంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన ప్రయత్నంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛమైన తెలుగులో ఆయన మాట్లాడుతుంటే సభలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఆశ్చర్యపోయారు. ఒక్క ఆంగ్లపదాన్ని వాడకుండా అయ్యన్నపాత్రుడు రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని సంబంధిత మంత్రులను కోరడంతో పాటు.. బిల్లులు ఆమోదం పొందాయని ఆయన తెలుగులోనే ప్రకటించారు. జనసేన, వైసీపీ పార్టీలకు సంబంధించి విప్, శాసనసభ పక్ష నేతల నియామకాలకు సంబంధించిన సమాచారం తనకు అందిందంటూ ఆయన పూర్తిగా తెలుగులోనే చదివారు. రెండు పార్టీల నుంచి తనకు వర్తమనానాలు అందయంటూ అయ్యన్నపాత్రుడు చేసిన భాష ప్రయోగంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

AP Assembly: వైసీపీ ఎక్సైజ్ పాలసీపై ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏమన్నారంటే?


గత ప్రభుత్వంలో..

వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు ఇంగ్లీష్ మీడియం పేరుతో మాతృభాషను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఓవైపు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లేకుండా.. మరోవైపు విద్యార్థులకు మాతృభాష ప్రాముఖ్యతను తెలవకుండా తెలుగు భాష ప్రాధాన్యతను తగ్గించిందనే ఆరోపణలు వచ్చాయి. తెలుగు భాష ప్రాధాన్యతను పెంచాలని ఎంతోమంది కోరినా.. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు.


ఇంగ్లీషు లేదా ఇతర భాషలను ప్రోత్సహించే క్రమంలో మాతృభాష ప్రాధాన్యతను తగ్గించవద్దని గత వైసీపీ ప్రభుత్వాన్ని ఎంతో మంది తెలుగు భాషా ప్రేమికులు వేడుకున్నారు. అయినాసరే డిగ్రీ కళాశాలల్లో కొన్నిచోట్ల పూర్తిగా తెలుగు మీడియాన్ని ఎత్తివేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా తెలుగు మీడియాన్ని విద్యాలయాల్లో ఎత్తివేయాలనే కుట్ర చేసిందంటూ అప్పట్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు వైసీపీని విమర్శించాయి. ఈక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాతృభాష ప్రాధాన్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటుందనడానికి అసెంబ్లీలో జరిగిన సంఘటన నిదర్శనంగా నిలుస్తుందని పలువురు తెలుగుభాషా ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

CM Chandrababu: వైసీపీ ఎక్సైజ్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం..


కొత్త సంప్రదాయం..

తెలుగు భాష గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడంతో పాటు.. మాతృ భాష ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు పూర్తిగా తెలుగుభాషనే ఉపయోగిస్తూ కొత్త సంప్రదాయానికి నాందిపలికారు. మంగళవారం, బుధవారం సభలో ప్రవేశపెట్టిన బిల్లుల సందర్భంగా బిల్లులు ప్రతిపాదించే సమయంలోనూ, ఆమోదం పొందే సమయంలోనూ ఆయన పూర్తిగా తెలుగు భాషను ఉపయోగించారు. తాను ఈ సంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నానని.. సభ్యలుంతా సహకరించాలని ఆయన కోరారు.


స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో బుధవారం సభలో కొంతమంది మంత్రులు, సభ్యులు సైతం ఎక్కువుగా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. మంగళవారం సభలో విజయవాడలో ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మారుస్తూ ప్రతిపాదించిన బిల్లును సంబంధింత శాఖ మంత్రి సత్యకుమార్ ఆంగ్లంలో ప్రతిపాదించగా.. బిల్లుపై చర్చ సందర్బంగా ఆయన పూర్తిగా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. తెలుగుభాషకు మరింత ప్రాధాన్యతను పెంచే ఉద్దేశంతో స్పీకర్ అయ్యనపాత్రుడు తీసుకున్న చొరవపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


JC Prabhakar: చంద్రబాబును కొద్దిగా వదిలిపెట్టమను... మేమేంటో చూపిస్తాం

TS News: తమను వెదకొద్దంటూ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 24 , 2024 | 06:08 PM