మున్సిపల్ సమావేశం నిర్వహించేదెప్పుడో..?
ABN , Publish Date - Aug 31 , 2024 | 11:57 PM
జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ అయిన మద నపల్లె మున్సిపల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని పట్టణవాసులు ప్రశ్నిస్తు న్నారు.
మదనపల్లె టౌన, ఆగస్టు 31: జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ అయిన మద నపల్లె మున్సిపల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని పట్టణవాసులు ప్రశ్నిస్తు న్నారు. 2.50లక్షల మంది జనాభా, అతి పెద్ద వార్షిక బడ్జెట్ ఉండే మదనపల్లె మున్సిపాలిటీలో నెల వారి మున్సిపల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఏ నెలకు ఆ నెల ప్రజల సమస్యలు మున్సి పల్ సమావేశంలో చర్చించి, పరిష్కార చర్యలను ఆమోదించాల్సి ఉంది. కాని ఆగస్టు నెలలో నిర్వహించాల్సిన మున్సిపల్ సాధార ణ సమావేశాన్ని ఎందుకో అధికారులు, పాలకులు నిర్వహించలేదు. దీంతో అటు మున్సి పల్ కౌన్సిలర్లు, ఇటు పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. మదనపల్లె పట్టణంలో 35 మున్సిపల్ వార్డులు ఉండగా ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుండటంతో కొన్ని వార్డులలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పాలకులు ప్రతి నెలా మున్సిపల్ సమావేశం నిర్వహించి ప్రజారోగ్య పరిరక్షణకు చర్చించి తీర్మాణాలు చేయాల్సి ఉంది. అంతే కాకుండా మదనపల్లె పట్టణం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వర్షాలు కురిస్తే చుట్టుపక్కల వర్షపు నీరంతా పట్టణంలోని ప్రధాన కాలువలు, బాహుదానది గుండా ప్రవహిస్తాయి. దీంతోపాటు పట్టణ నడిబొడ్డున ఉన్న కోమటివానిచెరువు నిండి పోయి, సరైన మొరవలు లేక వర్షపునీటితో కలసిన మురుగునీరు ఆర్టీసీ బస్టాండు, అంబే డ్కర్ సర్కిల్ వద్ద మడుగులా నిల్వ అవుతున్నాయి. వాటిపై మున్సిపల్ సమావేశంలో చర్చించి పనులు చేపట్టాల్సి వుంది. అలాగే గత కౌన్సిల్ సమావేశంలో చర్చించి, తీర్మాణిం చిన ప్రకారం ఇప్పటి వరకు చేపట్టిన సీసీరోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణ పనుల నాణ్యత, జనరల్ ఫండ్స్ ఖర్చు వివరాలపై చర్చించాలి. కానీ ఈనెల మాత్రం 31 రోజులు ముగిసినా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణపై ఎలాంటి సమాచారం అటు కౌన్సిలర్లకు గాని, ఇటు ప్రజాప్రతినిధులకు గాని తెలుపలేదు. దీంతో నెలలో చివరి రోజైన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారని ఎదురు చేసిన మున్సిపల్ కౌన్సిలర్లు విస్తుపోయారు. దీనిపై పట్టణ ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు.
వచ్చే వారంలో సమావేశం నిర్వహిస్తాం
మదనపల్లె మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ కోసం అనం తపురం, విజయవాడకు వెళ్లారు. అంతే కాకుండా శనివారం పట్టణంలో పింఛన్ల కార్యక్ర మం నిర్వహించాల్సి రావడంతో మున్సిపల్ సమావేశం నిర్వహించలేకపోయాం. వచ్చే వారం లోపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తాం.
-ప్రమీల, మున్సిపల్ కమిషనర్, మదనపల్లె